నా కెరీర్ ఆ సినిమాలు చేసే దెబ్బతింది...చార్మి
అనుకోకుండా ఒకరోజు, మనోరమ, మంత్ర లాంటి సినిమాలే తన కెరీర్ ని దెబ్బకొట్టాయని చార్మి భావిస్తోంది. ఆ విషయం వివరిస్తూ...కెరీర్ మొదట్లో ఎక్కువగా రొమాంటిక్ క్యారెక్టర్లే చేశాను.కొన్ని సినిమాలు చేశాక ఆ పాత్రల మీద నాకే విసుగొచ్చింది.అందుకే వైవిధ్యం కోసం పాకులాడాను. అనుకోకుండా ఒకరోజు, మనోరమ, మంత్ర లాంటి సినిమాలు ఆ క్రమంలో వచ్చినవే. కానీ హీరోయిన్‌కి లాంగ్ రన్ ఉండాలంటే గ్లామర్ పాత్రలే ఉండాలని తర్వాత అర్దమైంది. ఏ హీరోయిన్ కి అయినా గ్లామర్ పాత్రలే శరణ్యం. కెరీర్ స్పీడు తగ్గాక కానీ ఈ విషయం నాకు తెలిసిరాలేదు.దాంతో ఇప్పుడిప్పుడే అలాంటి పాత్రల వైపు మళ్ళాను. దాంతో మళ్లీ పూర్తిగా బిజీ అయ్యి పూర్వవైభవం సాధిస్తాననే నమ్మకం ఉంది అంది చార్మి. ప్రస్తుతం నేను చేసిన 'నగరం నిద్రపోతున్న వేళ" చిత్రం త్వరలో రానుంది. తప్పకుండా ఈ సినిమా నాకు మంచి పేరు తెచ్చిపెడుతుందని నా నమ్మకం అంది. ఈసారన్నా ఆమె మళ్ళీ నిలదొక్కుకోవాలని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications











