చార్మి కాలేజి స్టూడెంట్ గా ‘ఇందు’
'నీతోడు కావాలి" చిత్రంతో తెరగేట్రం చేసిన అందాల పంజాబీ ముద్దుగుమ్మ చార్మి 'ఇందు" గా ప్రధానపాత్రలో 'చంద్రముఖి" చిత్ర దర్శకుడు పి.వాసు దర్శకత్వంలో బి.బి.యస్ స్టూడియో పతాకంపై మురారిశెట్టి లక్ష్మణ్ (బాబి) నిర్మిస్తున్న 'ఇందు" ఆడియో వేడుక ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. శరవణ్ ఆడియో ద్వారా విడుదలైన ఈ చిత్రంలోని పాటల సిడిని సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్, చక్రి, ఘంటాడి కృష్ణలు ఆవిష్కరించి తొలి సిడిని శ్రీ లక్ష్మీగణపతి ఫిలింస్ అధినేత సుబ్రమణ్యంకు అందజేసారు.
ఈ సందర్భంగా ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ ''పి.వాసు-విద్యాసాగర్ కాంబినేషన్ అనగానే ఆ సినిమా సూపర్‌హిట్. విద్యాసాగర్ మెలోడీస్ అందరికీ నచ్చుతాయి"" అన్నారు. నిర్మాత మురారి శెట్టి మాట్లాడుతూ ''సరికొత్త కథ, కధనా లతో పాటు ఒక ఆదర్శవంతమైన కథాంశాన్ని తీసుకొని వైవిద్యంగా తెరకెక్కించారు దర్శకులు పి.వాసు.
ఈ చిత్రాన్ని మలచిన తీరు ఎంతో అద్భుతంగా ఉంటుందనీ, ఒక విభిన్న కథాంశంతో కాలేజి స్టూడెంట్ గా మలేషియాలోని కాలేజిలో చాలా చక్కగా రూపుదిద్దుకొందని అంటున్నారు దర్శకుడు. ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులకు ప్రతి ఆడపిల్లను అభిమానం తో కాలేజ్‌కి పంపాలే తప్పా అనుమానంతో కాదు అనే సందేశానికి ఈ చిత్రం ఓ కనువిప్పు కలిగించే విధంగా, ఫ్యామిలీ ఓరియంటెడ్‌గా వాణిజ్య విలువలతో ఈ చిత్రాన్ని రూపొందిండం జరిగింది. నేటి సమకాలీన పరిస్థితులను ప్రతిబింబించే విధంగా ఈ చిత్రం వుంటుంది"" అన్నారు.


Click it and Unblock the Notifications











