మీడియా రిపోర్టర్ అవతారమెత్తుతున్న చార్మి
వరస పరాజయాల్లో ఉన్న చార్మికి మరో అవకాశం వరించింది. చార్మి హీరోయిన్ గా గురుదేవ క్రియేషన్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించబోతోంది. ప్రేమ్‌రాజ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి రియల్ ఎస్టేట్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న నంది శ్రీహరి నిర్మాత. వచ్చే నెలలో షూటింగ్ మొదలవుతుంది. ఇక ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ ''సమకాలీన రాజకీయ, సామాజికాంశాల్ని ప్రస్తావించే కథ ఇది. చార్మి మీడియా రిపోర్టర్ గా నటించబోతోంది. ఆమెకి వృత్తిపరంగా ఎదురయ్యే అనుభవాలు కథను ముందుకు నడిపిస్తాయి. కమర్షియల్ విలువలు ఉన్న చిత్రం ఇది అన్నారు. ఇక ఈ చిత్రానికి కథ: దీన్ రాజ్, సంగీతం: కృష్ణాజీ, పాటలు: సుద్దాల అశోక్‌తేజ, చంద్రబోస్, భాస్కరభట్ల, అనంతశ్రీరామ్, గోరటి వెంకన్న; సహ నిర్మాత: టేకుల ముక్తిరాజ్. అలాగే చార్మి ప్రస్తుతం మంగళ చిత్రంలో చేస్తోంది. ఆమె హీరోయిన్ గా రియాలిటీ షో నేపధ్యంలో వచ్చిన సయ్యాట చిత్రం డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











