twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అది గర్వంగా చెప్పుకుంటాను.. ‘రొమాంటిక్’ డైరెక్టర్ ఛార్మీ కామెంట్స్

    |

    డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ వద్ద పని చేసే అసిస్టెంట్‌ను దర్శకుడిగా పరిచయం చేయబోతోన్నాడు. రొమాంటిక్ చిత్రంలో ఆకాష్‌ను హీరోగా నిలబెట్టగలడనే నమ్మకంతో శిష్యుడైన అనిల్‌ను పూరి నమ్మాడు. దీనికి తగ్గట్టుగా చిత్రీకరణ కూడా అద్భుతంగా సాగుతూ వచ్చింది. ఆ మధ్య రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్ ఎంత రొమాంటిక్‌గా ఉన్నాయో అందరికీ తెలిసిందే.అయితే ఈ పాటికే సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది కానీ.. కరోనా వైరస్ వచ్చి అంతా తారుమారు చేసింది.

    కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగ్‌లు నిలిచిపోయాయి. దాదాపు వంద రోజుల తరువాత సడలింపులు ఇవ్వడంతో షూటింగ్‌లు ప్రారంభమయ్యాయి. మళ్లీ షెడ్యూల్ ఖరారు చేసుకుని ఎవరి వీలును బట్టి వారు సెట్స్‌లోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. నేడు రొమాంటిక్ డైరెక్టర్ అనిల్ బర్త్ డే. ఈ సందర్భంగా పూరి, ఛార్మీ, చిత్ర యూనిట్, ఇతర స్నేహితులు అనిల్‌కు బర్త్ డే విషెస్ తెలిపారు.

    Charmi birthday wishes to Romantic Director Anil Paduri

    అనిల్ పుట్టిన రోజు సందర్భంగా పూరి ట్వీట్ చేస్తూ.. 'మై డియర్ అనిల్.. నీ క్రియేటివిటీతో నన్నెప్పుడూ ఎగ్జైట్ చేస్తూనే ఉంటావ్.. నీ తొలి సినిమా రొమాంటిక్ నిన్ను ఎంతో ఎత్తుకు చేర్చుతుంది. నీకు అంతా మంచే జరగాలి.. పుట్టిన రోజు శుభాకాంక్షలు' అని పేర్కొన్నాడు. ఛార్మీ ట్వీట్ చేస్తూ.. 'నాకు ఉన్న స్నేహితులందరిలో కెల్లా నువ్వే చాలా దగ్గరైన వాడివి, ప్రియమైన వాడివని ఎంతో గర్వంగా చెప్పుకుంటాను. మన 'రొమాంటిక్‌' ప్రాజెక్ట్‌ను అందరికీ చూపించాలని ఎంతో గర్వంగా ఎదురుచూస్తున్నాను. హ్యాపీ బర్త్ డే అనిల్' అని తెలిపింది.

    English summary
    Charmi birthday wishes to Romantic Director Anil Paduri. Puri jagannadh Also wished to Romantic Director Anil Paduri. My dear Anil You excite me with your creativity each time , ur directorial debut film #romantic will surely take u in great heights .. Have a fantastic year ahead .. happy birthday to u
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X