Don't Miss!
- Sports
అందుకే నా వికెట్ త్యాగం చేశా: వాషింగ్టన్ సుందర్
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- News
అటెన్షన్ అమరావతి: అందరి చూపూ అటు వైపే..!!
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
తెలుగు హీరోలపై ఛార్మింగ్ గర్ల్ చార్మి కంప్లైంట్...
మన హీరోలంతా యేడాదికి రెండు మూడు సినిమాలకు మించి చేయడం లేదు. దాంతో హీరోయిన్స్ కి ఎక్కువ అవకాశాలు రావడం లేదు అంటూ తన కెరీర్ మూలనపడటానికి హీరోల బద్దకమే కారణం అంటూ విశ్లేషించింది చార్మి. ఆమెను ఈ మధ్య మీ జోరు తగ్గిందేమిటి అని అడిగితే దానికి నిట్టూరుస్తూ ఇలా స్పందించింది. అలాగే ఆ కారణం చేతే చిన్న సినిమాల వైపు కూడా మేము చూడాల్సివస్తోంది. హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న సినిమాలని ఒప్పుకోవలసి వస్తుంది అని చెప్పింది.ఇక హీరో పక్కన రెండుమూడు పాటల్లో మెరిస్తే చాలు జనానికి నచ్చుతాయ.
స్టార్ హీరోలు పక్కన హీరోయిన్ గా కనిపించడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటారు. అక్కడ తమ పాత్ర పరిధి ఎంత అని కూడా ఆలోచించరు. నేనూ అలాగే భావిస్తాను అంది అదీ సంగతి. కాబట్టి ఆమ కు స్టార్ హీరోలు కరుణించి పాత్రలు ఇవ్వాలి.అలాగే వాళ్ళు కూడా కంటిన్యూగా సినిమా లు చేయాలి. ప్రస్తుతం ఓ అర్ధరాత్రి ఓ లేడీ జర్నలిస్ట్ చేసిన సాహసాన్ని ఇతివృత్తంగా తీసుకొని రూపొందించిన చిత్రం 'నగరం నిద్రపోతున్న వేళ". చార్మి జర్నలిస్ట్‌గా నటించింది. జగపతి బాబు ఇందులో ప్రత్యేక పాత్ర చేశారు. ప్రేమ్‌రాజ్ దర్శకత్వంలో నంది శ్రీహరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం జూన్ 17న విడుదల కానుంది.