'వైజాగ్ కత్తి' ఛార్మి?

By Staff

ఇక త్వరలో ఛార్మిని వైజాగ్ కత్తి అని అంతా పిలిచే అవకాశం ఉంది. అజయ్ హీరోగా రూపొందుతున్న సై ఆట చిత్రంలో ఆమె పాత్ర పేరు అదని సమాచారం. అయితే ఈ చిత్రానికి ఆచార్య అనే టైటిల్ ని ఫైనలైజ్ చేసే ఆలోచనలో దర్శక, నిర్మాతలు ఉన్నట్లు సమచారం. కోట శ్రీనివాసరావు కూడా కీలకపాత్రలో కనిపించే ఈ చిత్రం కథ టీవీలో వచ్చే డాన్స్ బేబి డాన్స్ తరహా రియాలిటి షో ల చుట్టూ తిరుగుతుంది. మే నెల రెండవ వారంలో మండు వేసవిలో ఈ చిత్రాన్ని పన్నీటి జల్లులా అందించటానికి దర్శక, నిర్మాతలు కృషి చేస్తున్నారు. ఇక ఈ చిత్ర దర్శకుడు పవన్ గతంలో సత్తా అనే చిత్రానికి డైరక్ట్ చేసారు. అవార్డు సంపాదించిన ఈ చిత్రం సాయికిరణ్ హీరోగా రూపొందింది.

ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోపై మంచి అంచనాలే ఉన్నాయి. తెరవెనుక దేవీకి, ఛార్మీకి ఉన్న అనుబంధం ఈ పాటలకు మంచి కిక్ ఇస్తుందని అంతా ఆశిస్తున్నారు. విలన్ వేషాలు వేసే అజయ్ ఈ చిత్రం ద్వారా హీరోగా ప్రమోషన్ పొందుతున్నాడు. అజయ్ హీరోగా తయారవుతున్న ఆ ఒక్కడే చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. అజయ్ తో రాజమౌళి శిష్యుడు కన్నన్ రూపొందిస్తున్న సారాయి వీర్రాజు కూడా పూర్తి కావొస్తోంది. ఇక శ్రీకాంత్ తో యమగోల మళ్ళీ మొదలైంది చిత్రాన్ని నిర్మించిన రాజశేఖర్ ఈ సినిమాని తన ప్రేమ్స్ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై ప్రొడ్యూస్ చేస్తున్నారు. అలాగే ఛార్మి కావ్యాస్ డైరీ, మాయగాడు చిత్రాలు త్వరలో రిలీజ్ కానున్నాయి. ఆమె క్రేజ్ మీద కొంత మార్కెట్ అవుతుందని, ఓపినింగ్స్ ఉంటాయని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X