చార్మి నన్ను 'మనీ' అని పిలుస్తుంది: నాగార్జున
చార్మి తనను మనీ అనిపిలుస్తుందని, ఎందుకంటే ఆమె కెరిర్ లో పెద్ద చెక్ నేనే ఆమెకు ఇవ్వటంతో ఆమె అలా అంటుంది. అలాగే ఆమెతో చేసిన మాస్ సినిమా పెద్ద హిట్ అయ్యింది. అప్పటినుంచి మా ప్రెండ్ షిప్ కొనసాగింది. ఆమె ఎప్పుడైనా ఏదైనా కొత్త కమిట్ మెంట్ చేసేటప్పుడు కానీ కొత్త పనులు ఏమైనా చేసేటప్పుడు కానీ ఫోన్ చేస్తుంది. నేను ఫలానా చేద్దామనుకుంటున్నా..ఫరవాలేదంటారా అని అడుగుతుంది. నేను ఇక్కడ అపార్టమెంట్ కొందామనుకుంటున్నా..ఏం చెయ్యమంటారు అంటుంది. దాన్ని మీరు చార్మికి అపార్టమెంట్ కొంటున్న నాగార్జున అని రాసేస్తారు. వాటిని ప్రొద్దున్నే నేను పేపర్ చదువుతూ గాసిప్ కాలంలో చూసి నవ్వుకుంటాను. చార్మితో నేనా...ఓ మైగాడ్..ఆమె చాలా చిన్న పిల్ల అనుకుంటూంటాను..నిజాయితీగా చెప్తున్నాను అన్నారు.
అలాగే అనుష్క విషయానికి వస్తే ఆమె మా కుటుంబంలో ఆమె ఓ భాగం. ఆమెకు ఫోటో షూట్ ఇక్కడే చేసాం. అప్పటినుంచి ఆమె మాలో కలిసిపోయింది. ఆమెను మా పేరెంట్స్ కూడా ఏక్సెప్ట్ చేసారు. ఇక పూనమ్ కౌర్ విషయానికి వస్తే ఆమె నాతో కేవలం గగనం చిత్రంలో చేసిందంతే. మా ఇద్దరికీ ఒక్క సింగిల్ ప్రేమ్ కూడా లేదు. అయినా మా ఇద్దరికీ రిలేషన్ అంటూ రాసేస్తారు. ఎప్పుడైనా ఆమె కనిపిస్తే హాయ్ అంటాను..ఓ హగ్ ఇస్తాను అంతే అని తేల్చేసారు నాగార్జున.


Click it and Unblock the Notifications











