'సై ఆట' లో చార్మి పాత్ర ఏమిటంటే...
త్వరలో రిలీజ్ కానున్న సై ఆట చిత్రంలో చార్మి...కొరియోగ్రాఫర్ గా కనిపించనుందని సమాచారం. ఈ చిత్రంలో పన్నెండు మంది పిల్లలు, వారితో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఆ అంశాలు పిల్లలను ఆకట్టుకుంటాయని అంటున్నారు. రియాల్టి షో నేపధ్యంలో ఈ చిత్రం సాగుతుందంటున్నారు. ఇక ఈ చిత్రంలో చార్మి పాత్ర పేరు మల్లేశ్వరి. ఆమె వేసుకునే కొన్ని ప్రత్యేకమైన దుస్తులు హైలెట్ గా నిలుస్తాయంటున్నారు. అలాగే ఈ చిత్రం ఆమె గ్లామర్ ఫిల్మ్ లలో ఒకటిగా నిలుస్తుందని, ఆమె చేసే పాత్ర ఇప్పటివరకూ చేయనంత కొత్తదని చార్మి నమ్మకంగా చెబుతోంది. ఈ చిత్రంలో చార్మి సరసన అజయ్ హీరోగా చేస్తున్నారు. నూతన దర్శకుడు పవన్ డైరక్ట్ చేస్తున్నాడు. శ్రీకాంత్ తో యమగోల మళ్ళీ మొదలైంది చిత్రాన్ని నిర్మించిన రాజశేఖర్ ఈ సినిమాని తన ప్రేమ్స్ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక చార్మి ప్రస్తుతం మంత్ర దర్శకుడు తులసీరామ్ డైరక్షన్ లో మంగళ అనే చిత్రం చేస్తోంది. దీనితో పాటు సముద్ర దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా వస్తున్న సేవకుడు లోనూ చేస్తోంది.


Click it and Unblock the Notifications











