ఆయన ఉంటే అదిరిపోతుంది.. చిరుపై చార్మీ కామెంట్
మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం ఎంతటి ఘన విజయాన్ని నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. తొలి స్వతంత్ర్య సమర యోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను సినిమాగా తీసి.. రేనాటి వీరుడును ప్రపంచానికి తెలిసేలా చేశాడు నిర్మాత రామ్ చరణ్. ఇక ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది.

వందకోట్లను దాటి పరుగులు పెడుతోంది..
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ ఎత్తును విడుదల చేసిన సైరా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. మొదటి రోజే 85 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి.. తెలుగు సినిమా స్టామినాను మరో సారి చాటింది. సైరా సృష్టించే సునామిని ఎవరూ ఆపలేకపోతున్నారు.

వారమైనా తగ్గని జోరు..
వారం రోజుల్లో ఈ మూవీ రెండు వందల కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసినట్టు సమాచారం. అయితే ఇప్పటికీ అదే జోరును కొనసాగిస్తూ.. థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇక సైరా సాధించిన విజయంతో మెగా కుటుంబంలో ఆనందాలు వెల్లివిరాశాయి.

సినిమాను వీక్షించిన గవర్నర్..
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై.. సైరా సినిమాను వీక్షించారు. సినిమాను ఎంతో అద్భుతంగా మలిచారని, స్వతంత్ర్య పోరాటంలో దక్షిణ భారతదేశ ప్రాముఖ్యతను చాటిచెప్పారని, పాండీరాజ్ పాత్రతో తమిళ, తెలుగు ప్రజల మధ్య ఉన్న సోదరభావాన్ని మరోసారి చూపించారని సైరా చిత్రాన్ని కొనియాడారు.

తాజాగా టీఎస్సార్ ప్రశంసలు..
సైరా ఇంతటి ఘన విజయాన్ని సాధించినందుకు.. కళాబంధు టీ. సుబ్బిరామిరెడ్డి ప్రత్యేకంగా సన్మానించారు. దీని కోసం ప్రత్యేకంగా ఓ ఈవెంట్‌ను నిర్వహించారు. దీనికి చిత్ర ప్రముఖులు, అతిథులు విచ్చేశారు. సైరా సినిమాపై ప్రశంసల జల్లును కురిపించారు. నిర్మాత రామ్ చరణ్, తమన్నాలను ప్రత్యేకంగా అభినందించారు.
ఆయన ఉంటే అదిరిపోతుంది..
ఈ కార్యక్రమానికి హాజరైన చార్మీ.. చిరుతో ప్రత్యేకంగా ఓ ఫోటో దిగారు. ఆ పిక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. చిరు ఉంటే చుట్టుపక్కలా డల్ మూమెంట్ అనేదే ఉండదు.. చిరు రాక్స్ అంటూ తనస్టైల్లో కామెంట్ చేసింది. ప్రస్తుతం చార్మీ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











