ప్చ్...చార్మి కోరికలు తీర్చటం కష్టమే
తెలుగులో తీరని కోరికలను గొంతెమ్మ కోరికలు అంటారు. అయితే చార్మి కోరికలను అంతా వాటితో పోలుస్తున్నారు. ఈ విషయం ప్రస్తావిస్తే...చార్మి నిట్టూర్పు విడుస్తూ...ఈ కోరికలు తీరితే..అనుకున్నది సాధించినట్లు..తీరుతాయో లేవో అంది. ఇంతకీ చార్మికి తీరని కోరికలు ఏమిటా అని అడిగితే..'హమ్ ఆప్‌కే హై కౌన్' చిత్రంలో మాధురీ దీక్షిత్ పాత్ర అంటే నాకిష్టం. అలాంటి పాత్రను చేయాలని ఉంది. ఇంకా సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో ఒక్క సినిమాలో అయినా నటించాలని ఉంది..అయితే చార్మి చేసిన చిత్రాలు రిలీజ్ కాకుండా డబ్బాల్లో మూలుగుతున్న ఈ సమంయంలో ఇంత పెద్ద కోరికలు పెట్టుకుంటే కష్టమేనంటున్నారు. ఎవరన్నా ముందుకు వచ్చి మన ఛార్మే కదా అని కోరక తీరుద్దామనుకున్నా అవేమీ చిన్నవు కాదు కదా అంటున్నారు. ఇక చార్మి తన తొలి చిత్రం 'నీ తోడు కావాలి' కోసం మేకప్ వేసుకొని తొమ్మిదేళ్లు నిండాయి. ప్రస్తుతం ఆమె శ్రీకాంత్ సరసన 'సేవకుడు'లో చిత్రంలో బుక్కయింది. అంతకుమించి ఆమెకు చేతిలో చిత్రాలు లేవు.


Click it and Unblock the Notifications











