ఛార్మి తొలిసారిగా గెస్ట్ రోల్ లో

By Srikanya

హైదరాబాద్ : ఛార్మి త్వరలో గెస్ట్ రోల్ లో కనపించి మురిపించనుంది. వరుణ్ సందేశ్, నిషా అగర్వాల్ కాంబినేషన్ లో రూపొందుతున్న సరదాగా అమ్మాయిలతో..చిత్రంలో ఆమె సెకండ్ హాఫ్ లో కనిపించనుంది.

ఈ విషయమై ఛార్మి మాట్లాడుతూ.. " ఇప్పటివరకూ నేను ఏ సినిమాలోనూ గెస్ట్ రోల్ చేయలేదు. భవిష్యత్ లోనూ చేస్తాననుకోవటం లేదు. అయితే ఈ చిత్రం చేయటానికి కారణం తమ పాత్రతో నన్ను కన్వీన్స్ చేయటమే. కనిపించేది కొద్ది సేపే కానీ..చతాలా ఎనర్జీగా ఉంటుంది. సినిమాకు నా పాత్ర ఓ ప్రత్యేకంగా నిలుస్తుందని భావిస్తున్నాను ." అంది.

వరుణ్‌సందేశ్‌-నిషా అగర్వాల్‌ జంటగా నటించిన సినిమా 'సరదాగా అమ్మాయితో'. పి.భానుశంకర్‌ దర్శకుడు. లక్ష్మీరాజ్యం సమర్పణలో పత్తికొండ కుమారస్వామి నిర్మిస్తున్నారు. రవివర్మ సంగీతం అందించిన ఆడియో మార్కెట్లోకి రీసింగ్ రిలీజై మంచి క్రేజ్ తెచ్చుకుంది.

దర్శకుడు మాట్లాడుతూ-''బడ్జెట్‌, లాభం, హీరో కాల్‌షీట్స్‌..ఇవేవీ అడగకుండా..నిర్మాత కథ విని అవకాశమిచ్చారు. అంతేకాదు...కొత్తవాళ్లకి ఛాన్సిచ్చారు.రవివర్మ చక్కని సంగీతం అందించారు. వరుణ్‌-నిషా.. మళ్లీ పనిచేయాలనిపించేంత సౌకర్యాన్నిచ్చారు. విజయం సాధిస్తాం'' అన్నారు. ఏమైంది ఈవేళ తర్వాత నిషాతో కలిసి నటిస్తున్నానని వరుణ్‌సందేశ్‌ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X