చాంగురే చార్మీ!?!
చార్మీ ముదురే. ముద్దుగా బొద్దుగా ఉంది ఆమెకేం తెలుసులే అనుకుంటే తెలుగు సినిమాలో కాలేసినట్టే. ఎందుకంటారా...ఆమెకు దశావతారం సినిమాలో కమల్ హాసన్ చేసినట్టుగా ఒకే సినిమాలో పది పాత్రలు చేయాలని ఉందిట. నవరాత్రి సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు వేసినట్టుగా తొమ్మిది పాత్రలైనా వేయలేక పోతానా అని చార్మీ ఫీలింగ్. తెలుగులో బాపు బొమ్మగా సుందరకాండలో కనిపించే అదృష్టాన్ని దక్కించుకున్న చార్మీకి పది పాత్రలు చేయించే దర్శకుడు కూడా దొరకాలని కోరుకుందాం. అవును మంత్ర సినిమా చేస్తున్న చార్మీకి మంత్రమేసి తానే పది పాత్రలు వేసిన ఒక సినిమాను సృష్టిస్తే పోలా.


Click it and Unblock the Notifications











