కృష్ణ వంశీ మాత్రమే తీర్చగలిగే కోరికతో చార్మి
నేను చిన్న వయసులోనే నటిని అయ్యాను. హీరోయిన్ గా కొనసాగడానికి నాకు ఇంకా పదిహేనేళ్ల సమయం ఉంది. ఇంత లాంగ్ టైమ్ లో తప్పకుండా అలాంటి పాత్ర చేసే అవకాశం వస్తుంది అని తన నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది చార్మి. ఇంతకీ ఆమె అంతలా చెయ్యాలనుకుంటున్న పాత్ర ఏమిటంటే...'అంతఃపురం' చిత్రంలో సౌందర్య చేసిన పాత్ర. ఆ విషయం చెబుతూ..'అంతఃపురం' సినిమా టీవీలో వచ్చిన ప్రతిసారీ చూస్తూనే ఉంటా. అందులో సౌందర్య చేసిన పాత్రంటే నాకు భలే ఇష్టం.ఆమె అద్భుతంగా చేశారు. కృష్ణవంశీ అద్భుతంగా తీశారు. లైఫ్ లో ఒక్క సారైనా అలాంటి పాత్ర చేయాలని ఉంది. చేస్తా కూడా. అందుకు తగిన సమయం ఉంది అంటోంది. అంటే వరస ఫ్లాపుల్లో ఉన్నా చార్మికి మరో పదిహేనేళ్ళపాటు కొనసాగుతానన్న నమ్మకం ఉందన్నమాట. అయినా కృష్ణవంశీ ఆమెకు క్లోజ్ కాబట్టి అలాంటి పాత్రను మరొకటి డిజైన్ చెయ్యమంటే పోలా. ఎందుకంటే అంత గొప్ప పవర్ ఉన్న పాత్ర కృష్ణవంశీ మాత్రమే తయారుచెయ్యగలడు కదా.


Click it and Unblock the Notifications











