చార్మి ఇప్పుడు తెలుగులో చాలా బిజీఅయింది.బాపు బొమ్మగానే కాకుండా అనేక షాపులకు ఉత్పత్తులకు ఆమె బ్రాండ్ అంబాసిడర్. పంజాబీ అయినా తెలుగులో ఒద్దికగా ఒదిగిపోయిన ఘనత ఆమెది.తోడు కావాలి తో పరిచయమైన పంజాబీ బొద్దు గుమ్మ ఛార్మి. ప్రారంభంలో వరస అపజయాలతో కెరీర్ ప్రారంభించింది. తరువాత దర్శకుడు కృష్ణ వంశీ పంచన చేరంది ఈ ఛార్మింగ్ పర్సనాలిటీ.కాని ఎంత ఎక్స్ పోజింగ్ చేసినా ఒక్క హిట్టు కొట్టలేక పోయింది.అదేం చిత్రమో గాని అలా విడిపోగానే ఇలా దశ తిరిగింది.అప్పుడు వచ్చిన అనుకోకుండా ఒక రోజు' ఆమె కెరీర్ ని మార్చేసింది.దూరమవుతున్న కొద్దీ సక్సస్ దగ్గరవటం మొ దలయింది. తరువాత వచ్చిన 'మంత్ర' కుదిపేసింది.ఖడ్గం లో రవితేజా డైలాగు ఒక్క ఛాన్సు లా..ఈ రోజుల్లో ఒక్క హిట్టు చాలు బిజీ కావటానికి.అలా అలలా ఆమె హవా ప్రారంభమంది.ఇప్పుడు ఆమె తెలుగు ఇండస్ట్రీ సక్సెస్ మంత్ర. పేరు చెబితే చాలు బయ్యర్లు,డిస్ట్రిబ్యూటర్లు,ఫైనాన్సర్లు ముందుకు వస్తున్నారు.దాంతో ఆమెతో స్టార్టయ్యే సినిమాలు బాగా పెరిగాయి.హీరో శ్రీకాంత్,ప్రభుదేవా,సునీల్ కాంబినేషన్ లో తయారవుతున్న మైఖేల్ మదన కామరాజు లోనే కాక తమిళ తెలుగు భాషల్లో రెడీ అవుతున్న ఓ చిత్రంలోనూ,తాజాగా వేణు సరసన మాయగాడు లో చేస్తోంది.రామానాయుడు గారి సినిమాలోనూ శ్రీకాంత్ సరసన బుక్కయింది.అంతే గాక తరుణ్,ఇలియానాల కాంబినేషన్ లో వస్తున్న భలే దొంగలు లో ఐటం సాంగ్ చేస్తోంది.నాలుగు చిత్రాల ప్రపోజల్స్ నడుస్తున్నాయి.