twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాకు బ్యాటింగ్‌ అంటే ఇష్టం...: చార్మి

    By Srikanya
    |

    హైదరాబాద్: ''నాకు బ్యాటింగ్‌ అంటే ఇష్టం. మైదానంలోకి దిగి బ్యాట్‌ చేతపట్టాలనిపిస్తోంది. హీరోయిన్స్ అంతా కలిసి మైదానంలోకి దిగితే గమ్మత్తుగా ఉంటుంది''అని చెప్పుకొచ్చింది చార్మి. సీసీఎల్‌ సందడి ఆదివారం కూడా కొనసాగింది. దీనికి హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియం వేదికైంది. వీర్‌ మరాఠీ, బెంగాల్‌ టైగర్స్‌ జట్లు ఒకవైపు తలపడగా... తెలుగు వారియర్స్‌, ముంబై హీరోస్‌ జట్లు మరోపక్క పోటీ పడ్డాయి.

    ఈ మ్యాచ్‌లు ఆద్యంతం ప్రేక్షకుల్ని ఉత్సాహంలో ముంచెత్తాయి. స్టేడియంలో కేకలు, ఈలలు, అరుపులు మార్మోగిపోయాయి. తెర మీద సందడి చేసే హీరో,హీరోయిన్స్ మైదానంలో, బయటా తమదైన శైలిలో వినోదం పంచారు. గెలుపు, ఓటమితో సంబంధం లేకుండా ఆటగాళ్లు అందరూ ప్రేక్షకులు పంచిన అభిమానాన్ని అందుకొన్నారు. ఈ ఉత్సాహాన్ని మీడియాతో చార్మి పంచుకుంది.

    చార్మి మాట్లాడుతూ.. ''గతేడాదితో పోలిస్తే మన జట్టు మరింత బలంగా తయారైంది. మంచి ఆటగాళ్లు ఉన్నారు. ఈసారి కప్పు గెలవడం ఖాయం. నేనెక్కడున్నా నా మనసంతా తెలుగు వారియర్స్‌ జట్టుపైనే. గత మ్యాచ్‌కి నేను కొన్ని కారణాలవల్ల వెళ్లలేకపోయాను. మన గడ్డపై జరుగుతున్న మ్యాచ్‌ని ప్రత్యక్షంగా వీక్షించడం ఎంతో ఆనందాన్నిచ్చింది''అని చెప్పుకొచ్చింది చార్మి. తెలుగు వారియర్స్‌ జట్టుకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఆదివారం మ్యాచ్‌లో ఆద్యంతం ఉత్సాహంగా గడిపింది. ఆటగాళ్లను తనదైన శైలిలో ప్రోత్సహిస్తూ గడిపింది.

    అలాగే ''వెంకటేష్‌ నాయకత్వం నన్ను బాగా ఆకట్టుకొంటోంది. ఆటగాళ్లకు చక్కటి ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. తెలుగు వారియర్స్‌ జట్టు ఆట తీరు బాగుంది. బంతి బంతికీ ప్రేక్షకులు కేరింతలు కొడుతూ ఆస్వాదిస్తున్నార''ని చెప్పుకొచ్చింది. ఆటలో మీ భాగస్వామ్యం ఎంత అని అడిగితే... ''ఆటగాళ్లను ప్రోత్సహించడమే మా పని. ఆ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు'' అని చెప్పుకొచ్చింది.

    English summary
    Actress Charmi at CCL 3 Telugu Warriors Vs Mumbai Heroes Match. She is happy to participate in this game.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X