ఎదురు దెబ్బల వల్లే నాలో..చార్మి
నేను ఎదుర్కొన్న ఎదురు దెబ్బల వల్లే ఇప్పుడు నాలో కసి పెరిగింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఏది కరక్టు..ఏది కాదు వంటి విషయాలన్నీ అర్ధం చేసుకున్నాను అంటోంది చార్మి. ఆమె నటించిన "'బుడ్డా' హిట్టవటంతో ఆమె ఆనందానికి అంతేలేకుండా పోయింది. తన బాలీవుడ్ ఎంట్రి హిట్ తో మొదలైనందుకు ఉత్సాహంగా మాట్లాడుతూ ఇలా స్పందించింది. అలాగే హిట్ ఉత్సాహన్నిస్తుంది. అయితే వెంటనే రిలాక్స్ అయిపోతాం. ప్లాఫ్ అలా కాదు. కసిని పెంచుతుంది. ఫెయిల్యూర్ తో నేర్చుకొన్న పాఠాలు జీవితాంతం గుర్తిండిపోతాయి. అందుకే...ఫ్లాప్ మంచిదే అంటోంది చార్మి. ఇక తెలుగులో ఆమె రీసెంట్ గా నటించిన నగరం నిద్రపోతున్న వేళ చిత్రం విడుదలై ప్లాప్ అయింది.


Click it and Unblock the Notifications











