twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బరువు తగ్గిన చార్మి హాట్ లుక్ (ఫోటో)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: హీరోయిన్ చార్మి ఈ మధ్య చాలా బొద్దుగా తయారైన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన 'ప్రేమ మైకం' చిత్రంలో చార్మి రూపం విమర్శలకు దారి తీసింది. దీంతో బరువు తగ్గాలని నిర్నయించుకున్న చార్మి చాలా కష్టపడి ఏకంగా 9 కిలోలు తగ్గింది. తన లుక్ ఇపుడు ఎలా ఉంది? అంటూ ఓ ఫోటోను తన ట్విట్టర్లో పోస్టు చేసింది. బరువు తగ్గిన తర్వాత చార్మి చాలా హాట్‌గా ఉంది కదూ!

    ఇక ఆమె సినిమా ప్రొఫెషన్ విషయాల్లోకి వెళితే....చార్మి రాత్రి పూట షూటింగులు ఉండొద్దని కోరుకుంటోంది. వీలైనంత వరకు రాత్రి పూట షూటింగులకు దూరంగా ఉండాలనే భావిస్తోంది. గతంలో జరిగిన కొన్ని సంఘటనల వల్లనే ఆమె రాత్రి పూట షూటింగుల్లో పాల్గొనేందుకు భయ పడుతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. మరి రాత్రి పూట చార్మికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయో? అవి బయటికి చెప్పుకోలేనివా? అంటూ ఫిల్మ్ నగర్లో రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

    ప్రస్తుతం చార్మి 'మంత్ర 2' చిత్రంలో నటిస్తోంది. ఇది హారర్ నేపథ్యంలో సాగే సినిమా కావడంతో ఎక్కువగా రాత్రి పూట షూటింగులే ఉన్నాయట. రాత్రి పూట షూటింగుల్లో పాల్గొనడం ఇష్టం లేక పోయినా.....స్క్రిప్టు డిమాండు మేరకు తప్పడం లేదట. వీలైనంత వరకు రాత్రి పూట షూటింగులు వద్దని దర్శక నిర్మాతలకు చెబుతోందట.

    మంత్రి 2 సినిమా విషయానికొస్తే...ఎస్.వి.సతీష్ దర్శకత్వంలో తేజ ఫిలింస్ పతాకంపై బోనాల శ్రీకాంత్, పి.శౌరిరెడ్డి, రవితేజ 'మంత్ర-2' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేక్షకులకు అనుక్షణం ఉత్కంఠ కల్గించేలా హారర్, సస్పెన్స్‌తో సినిమా తెరకెక్కుతోంది. రఘుబాబు, హేమ, తా.రమేష్, రావూ రమేష్, సన తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:ఆర్.పి.తనికెళ్ల, ఎడిటింగ్:సిద్దంసెట్టి బా బు, నిర్మాతలు:బోనాల శ్రీకాంత్, పి.శౌరిరెడ్డి, రవితేజ, దర్శకత్వం:ఎస్.వి.సతీష్.

    English summary
    Charmi hot look after losing 9 kgs weight. Charmi faced severe criticism regarding her plump look. Charmi realized the truth struggling hard on workouts for past few months.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X