హాట్ చార్మి... ఏం రెచ్చగొడుతోంది!!! (ఫోటో ఫీచర్)
హైదరాబాద్: చార్మి తాజా చిత్రం 'ప్రేమ ఒక మైకం'. చందు దర్శకత్వం వహిస్తున్నారు. టూరింగ్ టాకీస్ పతాకంపై తెరకెక్కిస్తున్నారు. డి. వెంకట సురేష్, కె. సూర్య శ్రీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'హ్యాపీడేస్' ఫేమ్ రాహుల్, 'ప్రేమిస్తే' శరణ్య ఇందులో కీలక పాత్రధారులు. ఇప్పటికి 80 శాతం చిత్రీకరణ పూర్తయింది.
ఈ చిత్రానికి ఇటీవలే గోవాలో ఓ కీలకమైన షెడ్యూలు చేసారు. చార్మి, తదితరులపై ముఖ్య సన్నివేశాలు చిత్రీకరించారు. ప్రస్తుతం ఆర్ ఎఫ్ సిలో కొన్ని సీన్లు షూట్ చేస్తున్నారు. ఈ నెలాఖరుకు షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. ఇందులో మొత్తం 8 పాటలు ఉన్నాయి
గతంలో సావిత్రి, జయసుధ, శ్రీదేవి, లక్ష్మి, ప్రభ, టబు, కరీనా కపూర్, అనుష్క వంటి ప్రముఖ హీరోయిన్స్ అంతా వేశ్య పాత్రలో రాణించారు. ఆ స్థాయిలోనే ఇందులో చార్మి పాత్ర ఉంటుంది అని దర్శకుడు నమ్మకంగా చెప్తున్నారు. ఆ చిత్రంలోని కొన్ని హాట్ ఫోటోలను విడుదల చేసారు. అవి మీకోసం..

చార్మి ఈ చిత్రంలో వేశ్య పాత్రలో కనిపించనుంది. ఇదొక మ్యూజికల్ లవ్‌స్టోరీ.

దాదాపు ఫేడవుట్ అయిపోయిన దశలో ఉన్న చార్మి ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుంది.

ఇందులో చార్మి పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందని, ఎంతో శ్రద్ధ తీసుకుని ఈ పాత్రను తీర్చిదిద్దుతున్నామని దర్శకుడు చెప్తున్నారు.

ఈ చిత్ర దర్శకుడు చందు గతంలో 'టెన్త్‌క్లాస్', 'నోట్ బుక్' చిత్రాలను తెరకెక్కించారు.

ఒక వేశ్యకు, రచయితకు, గాయనికి మధ్య జరిగే కథ ఇది.

రీసెంట్ గా ఢమురకం చిత్రంలో చార్మి... సక్కుబాయి పాటలో కనిపించి...తనకు ఇంకా క్రేజ్ తగ్గలేదని నిరూపించింది.

ఢమురకం ఇచ్చిన ఉషారుతో చార్మి మరోసారి ‘నెల్లూరే..' అనే ఐటం సాంగులో రామ్ చరణ్ తో పాటు నాయక్ లో స్టెప్స్ వేసి మురిపిస్తోంది.

ప్రేమ ఒక మైకంలో.... సోని చరిష్టా, సతీష్, చంద్రమోహన్, రావు రమేష్, తాగుబోతు రమేష్, పృథ్వీ, సురేఖావాణి, చంటి, జాకీ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి మాటలు: పులగం సి. నారాయణ, కెమెరా: ప్రవీణ్ బంగారి, పాటలు: కులశేఖర్, శశి, సమర్పణ: బేబీ హ్యాపీ.


Click it and Unblock the Notifications











