అదే ఛార్మి రిక్వెస్టు
ఐటం గర్ల్ గా చూడద్దు..అంటూ ఛార్మి రిక్వెస్ట్ చేస్తోంది. తాజాగా మహాత్మా చిత్రంలో ఆమె చేసిన ఐటం సాంగ్ పేలటంతో ఆ తరహా ఆఫర్స్ వస్తున్నాయని విసుక్కుంటోంది. భలే దొంగలు అనంతరం అదే రకంగా జరిగింది..నిజానికి స్పెషల్ సాంగ్స్ అనేవి ఓ నటికి గుర్తింపు తెచ్చేవే. మంచి స్టార్ అని గుర్తు చేసేవే. అందులోనూ మూడు నిముషాలు తెరపై కనిపించినందుకు బాగానే గిట్టుబాటు అవుతాయి. డబ్బు, డేట్స్ కంఫర్ట్ గా ఉంటాయి. అయితే మళ్ళీ మళ్లీ అదే తరహా ఐటం సాంగ్ ఆఫర్స్ రావటమే ఇందులో ఉన్న డిస్ ఎడ్వాంటేజ్. అయినా బేసికల్ గా నేను నటిని, అందులోనూ సెలెక్టివ్ గా పాత్రలు ఎంపిక చేసుకుంటూడంతో గ్యాప్ వస్తుంది.మర్చిపోకుండా ఉండేందుకు ఈ ఐటం సాంగ్స్ తోర్పడతాయి కూడా అని సమర్ధించుకుంటోంది. ఇంతకూ ఆమె ఐటం సాంగ్స్ లో ఆఫర్స్ ఇమ్మని అడుగుతోందా..లేక అలాంటి ఆఫర్స్ తో రావద్దని చెప్తోందో విన్నవారికి మాత్రం అర్దం కాలేదు.


Click it and Unblock the Notifications











