పూరి పుణ్యమా అని చార్మికి మరో ఛాన్స్ ..
వరుస పరాజయాలు రావడంతో తెలుగులో దాదాపుగా ఫేడ్ అవుట్ అయిన చార్మికి ఇప్పుడు తెలుగులో సరైన అవకాశఆలు వరించడం లేదు. దాంతో ఇంచుమించు ఇక కెరీర్ అయిపోయిందనుకుంటున్న తరుణంలో చార్మీకి హిందీలో అవకాశాలు వస్తున్నట్టు కనిపిస్తున్నాయి. పూరీ జగన్నాథ్ పుణ్యమా అని ఇటీవల వచ్చిన 'బుడ్డా' హిందీ సినిమాలో తొలిసారిగా నటించిన చార్మీకి అక్కడ మంచే పేరే వచ్చింది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఆమెకు ఎంక్వయిరీలు వస్తున్నాయి.
తాజాగా ఆమెకు మరో హిందీ సినిమాలో నటించే ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. 'జిల్లా గజియాబాద్' పేరుతో రూపొందే ఈ చిత్రంలో సంజయ్ దత్, వివేక్ ఒబెరాయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మల్టీస్టారర్ చిత్రంలో కథానాయికగా చార్మీ ఎంపికైందని సమాచారం. వినోద్ బచ్చన్ నిర్మించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళనుంది. ఇక ఈ చిత్రంలో చార్మి హాట్ హాట్ గా అందాల ప్రదర్శన చేసి బాలీవుడ్ ప్రేక్షకులను ఆకర్షించడానికి రెడీ అయ్యిందట...


Click it and Unblock the Notifications











