పూరీ జగన్నాధ్ వల్లే ట్విట్టర్ లో ఛార్మి
అందుకు ఆమె మొదట పూరీ జగన్నాధ్ కు ధాక్స్ చెప్పుకుంది. పూరీనే తనను ఈ ట్విట్టర్ లోకి రమ్మని ఆహ్వానించారని అంది. అలాగే తన తోటి నటీనటలుకు ఆమె శుభాకాంక్షలు తెలుపుతూ ఆహ్వానించింది. తన అభిమానులుకు ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అప్ డేట్స్ తెలుపుతానని చెప్పుకొచ్చింది. ట్విట్టర్ లో పోస్ట్ లు ద్వారా ఆమె తిరిగి వార్తల్లో వ్యక్తిగా మారి బిజీగా ఉండాలనుకుంటోంది.
ప్రస్తుతం ఛార్మికి తెలుగులో ఆపర్స్ సైతం ఏమీ లేవు. హిందీలో అయినా సెటిల్ అవుదామనుకున్న ఆమె ఆసలు అక్కడ పెద్దగా ఆఫర్స్ రాకపోవటంలో చాలా నిరాశలో పడిపోయింది. తెలుగులో ఆమె చేసిన సినిమాలు ఏమీ గత రెండేళ్లుగా ఆడలేదు. అన్నీ డిజాస్టర్స్ అయ్యీయి. కొన్ని సినిమాలు ప్రారంభ దశలోనే ఆగిపోయాయి. దాంతో ఆమె ఇక్కడ నుంచి ముంబైకి మకాం మార్చేసింది.
అప్పట్లో పూరి జగన్నాథ్ ధర్శకత్వంలో వచ్చిన హిందీ మూవీ 'బుడ్డ హోగా తెర బాప్"లో కలిసి నటించిన బాలీవుడ్ నటుడు సోనూసూద్, హీరోయిన్ ఛార్మికి మధ్య ఎఫైర్ ముదిరినట్లు వస్తున్న వార్తలను సోను ఖండించారు. అవన్నీ అర్థం పర్థం లేని పుకార్లే నని కొట్టి పారేశారు. నేను నా భార్యతో సంతోషంగా ఉన్నాను, నేను ఆమెను మోసం చేస్తున్నట్లు వస్తున్న వార్తలో నిజం లేదన్నారు. ఇలాంటి ప్రచారం ఎవరు చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేనద వ్యక్తం చేశారు. ఇలాంటి వార్తల వల్ల తన కెరీర్ దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications












