Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
జనాన్ని మోసం చేసే ఛార్మింగ్ ఛార్మి
అందాల ఛార్మి తన అందచందాలతో జనాల్ని మోసం చేయబోతోంది. ఆమె హీరోయిన్ గా నటించిన లవకుశ అనే కన్నడ చిత్రం 'జాదూగాళ్లు' గా తెలుగులోకి డబ్బింగ్ అవుతోంది. ఇందులో ఆమె పాత్ర జనాల్ని మోసం చేస్తూంటుంది. అలాగే ఈ చిత్రంలో ఉపేద్ర హీరోగా చేస్తున్నారు. సాయిప్రకాష్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో రుతిక మరో ముఖ్యపాత్ర పోషించింది. ప్రస్తుంతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకుని విడుదలకు సిద్ధమవుతోంది.విజయ్ ఫిలిమ్స్ పతాకంపై కె. ప్రభాకర్ నిర్మించిన ఈ చిత్రాన్ని మరో నిర్మాత యువరాజ్ ఆంధ్రప్రదేశ్ అంతటా విడుదల చేయబోతున్నారు. అలాగే తాజాగా ఛార్మి నటించిన మరో తమిళ చిత్రం కూడా తెలుగులోకి డబ్బింగ్ అవుతోంది.
ఈ చిత్ర విశేషాలను యువరాజ్ మీడియాకు తెలియజేస్తూ "ఉపేంద్ర ఈ చిత్రంలో ఒక వైవిధ్యమైన పాత్రలో, స్టయిల్‌తో కనిపిస్తారు. గ్లామర్ క్వీన్ ఛార్మిది ఒక మాస్ పాత్ర. ఉపేంద్ర, ఛార్మి జనాన్ని మోసం చేసే 'జాదూగాళ్లు'గా నటించారు. వాళ్లిద్దరి మధ్య నడిచే మాస్ ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. మంచి సినిమాల దర్శకుడిగా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన సాయిప్రకాష్ ఈ చిత్రాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా మలిచారు. గురుకిరణ్ సంగీతం సమకూర్చిన ఆరు పాటలూ అలరిస్తాయి. ఈ వారంలో ఆడియోనూ, వచ్చే వారంలో సినిమానూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు. జెన్నిఫర్, సత్యప్రకాష్, సాయాజీ షిండే, సలీమ్ పండా, సుమిత్ర, గిరీష్ కర్నాడ్ తారాగణమైన ఈ చిత్రానికి ఫైట్స్: థ్రిల్లర్ మంజు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సాయిప్రకాష్.