చార్మితో... ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటనపై సినిమా
గ్యాంగ్ రేప్ లో తీవ్ర గాయాల పాలైన యువతి ప్రాణాలతో పోరాడి చివరకు తుది శ్వాస విడిచింది. ఈ దారుణ ఘటన దేశం మొత్తాన్ని కదిలించింది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పార్లమెంటు ముట్టడికి దారి తీసింది. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికతో అల్లాని శ్రీధర్ మాట్లాడుతూ... ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటనపై సినిమా తీయబోతున్నట్లు స్పష్టం చేసారు. ప్రస్తుతం తన టీం స్క్రిప్టు వర్కులో బీజీగా ఉన్నట్లు వెల్లడించారు. అదే విధంగా ఈ సినిమాలో ఛార్మిని హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
ఈ పాత్రకు చార్మి అయితేనే కరెక్ట్ గా సూట్ అవుతుందని, ఆమె మంచి నటి అంటూ దర్శకుడు చార్మి గురించి చెప్పుకొచ్చారు. నేను దీన్ని నార్మల్ కమర్షియల్ సినిమాలా కాకుండా యువతకు సందేశాన్ని ఇచ్చే చిత్రంగా తెరకెక్కించబోతున్నాను' అని అల్లాని శ్రీధర్ వెల్లడించారు.
అయితే ఈ చిత్రం డాక్యుమెంటరీలా మాత్రం ఉండదని, పూర్తి స్థాయి చిత్రంగా ఉంటుందని, యువతకు సందేశాన్ని ఇచ్చే చిత్రంగా ఈ చిత్రం ఉంటుందని శ్రీధర్ స్పష్టం చేస్తున్నారు. ఢిల్లీ ఘటనపై దేశ వ్యాప్తంగా యువత చైతన్య వంతులై స్పందించడం ఆహ్వానించ దగ్గ విషయమని, అదే సమయంలో ఢిల్లీ గ్యాంగ్ రేప్ లాంటి ఘటనలు మళ్లీ జరుగకుండా, యువత పెడదారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో ఎర్ర సైన్యం, మాతృదేవోభవ సినిమాలను నిర్మించిన చదలవాడ శ్రీనివాస్ రావు ఈ చిత్రాన్ని నిర్మించాబోతున్నారు. దాదాపు రూ. 5 కోట్ల బడ్జెట్ అంచనాతో ఈ సినిమాకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications












