twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చార్మితో... ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటనపై సినిమా

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఢిల్లీలో ఓ యువత బస్‌లో గ్యాంగ్ రేప్‌కు గురైన సంఘటన గత కొన్ని వారాలుగా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై తెలుగు సినిమా రాబోతోంది. గతంలో కొమురంభీం జీవితంపై సినిమాను, గౌతమ బుధ్దుడిపై చరిత్రాత్మక చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు అల్లాని శ్రీధర్ ఈచిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో అల్లాని శ్రీధర్ హీరోయిన్ ఛార్మిని ఈ వివాదాస్పద సినిమాలో లీడ్ రోల్ హీరోయిన్ గా తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడు.

    గ్యాంగ్ రేప్‌ లో తీవ్ర గాయాల పాలైన యువతి ప్రాణాలతో పోరాడి చివరకు తుది శ్వాస విడిచింది. ఈ దారుణ ఘటన దేశం మొత్తాన్ని కదిలించింది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పార్లమెంటు ముట్టడికి దారి తీసింది. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికతో అల్లాని శ్రీధర్ మాట్లాడుతూ... ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటనపై సినిమా తీయబోతున్నట్లు స్పష్టం చేసారు. ప్రస్తుతం తన టీం స్క్రిప్టు వర్కులో బీజీగా ఉన్నట్లు వెల్లడించారు. అదే విధంగా ఈ సినిమాలో ఛార్మిని హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

    ఈ పాత్రకు చార్మి అయితేనే కరెక్ట్ గా సూట్ అవుతుందని, ఆమె మంచి నటి అంటూ దర్శకుడు చార్మి గురించి చెప్పుకొచ్చారు. నేను దీన్ని నార్మల్ కమర్షియల్ సినిమాలా కాకుండా యువతకు సందేశాన్ని ఇచ్చే చిత్రంగా తెరకెక్కించబోతున్నాను' అని అల్లాని శ్రీధర్ వెల్లడించారు.

    అయితే ఈ చిత్రం డాక్యుమెంటరీలా మాత్రం ఉండదని, పూర్తి స్థాయి చిత్రంగా ఉంటుందని, యువతకు సందేశాన్ని ఇచ్చే చిత్రంగా ఈ చిత్రం ఉంటుందని శ్రీధర్ స్పష్టం చేస్తున్నారు. ఢిల్లీ ఘటనపై దేశ వ్యాప్తంగా యువత చైతన్య వంతులై స్పందించడం ఆహ్వానించ దగ్గ విషయమని, అదే సమయంలో ఢిల్లీ గ్యాంగ్ రేప్ లాంటి ఘటనలు మళ్లీ జరుగకుండా, యువత పెడదారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో ఎర్ర సైన్యం, మాతృదేవోభవ సినిమాలను నిర్మించిన చదలవాడ శ్రీనివాస్ రావు ఈ చిత్రాన్ని నిర్మించాబోతున్నారు. దాదాపు రూ. 5 కోట్ల బడ్జెట్ అంచనాతో ఈ సినిమాకు ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    The gang-rape of a student on a bus in New Delhi has become the much-debated topic in recent weeks. The latest news about the case that we hear is that director Sridhar Allani, who has earlier directed films like Buddha and Utsaham, has planned to make a movie on this issue and he is currently in talks with actress Charmi Kaur for the female lead in this controversial flick.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X