చార్మి కాలుకి దెబ్బ తగిలి..షూటింగ్ బ్రేక్
చార్మి ప్రస్తుతం చేస్తున్న మంగళ చిత్రం క్లైమాక్స్ షూటింగ్ లో ఆమె కాలికి దెబ్బ తగిలింది. దాంతో డాక్టర్స్ సూచన మేరకు ఓ రెండు రోజులు బ్రేక్ తీసుకుంటున్నారని సమాచారం. నల్లమల అడవుల్లో ఈ షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో ఆమె ఓ సిని తారగా చేస్తున్నట్లు సమాచారం. చార్మికి సూపర్ హిట్ మంత్ర ఇచ్చిన ఓషో తులసీరామ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. విశ్వ ట్యూన్స్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాకి శివేంద్ర కెమెరా అందిస్తున్నారు. ఈ చిత్రం గురించి చార్మి మాట్లాడుతూ...అసాధారణ స్క్రిప్టుతో తులసీరామ్ ఈ చిత్రాన్ని తీస్తున్నారు. 'మంత్ర' కంటే రెండు మెట్లు ఎక్కువగా ఈ సినిమా ఉంటుంది. 'మంగళ' పాత్రలో నన్ను నేనే చాలెంజ్ చేసుకుంటున్నా. ఇది బాగా భయపెట్టే సినిమా అంటోంది. ఇక తులసీరామ్..."గ్రాఫిక్స్ లేకుండా 'మంత్ర' తీసిన నేను, గ్రాఫిక్స్‌ని ఉపయోగిస్తూ హారర్ ఫిల్మ్‌గా 'మంగళ' తీస్తున్నా అంటున్నారు.


Click it and Unblock the Notifications











