శివరాత్రినాడు భయపెట్టటానికి చార్మి ప్రిపరేషన్

By Srikanya

చార్మి ప్రధాన పాత్రగా దర్శకుడు ఓషో తులసీరామ్(మంత్ర ఫేమ్) రూపొందించిన చిత్రం 'మంగళ'. మంత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సిహెచ్.వి. శర్మ, ఓషో తులసీరామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాణ పనులన్నీ ముగింపుకొచ్చిన ఈ చిత్రాన్ని మహాశివరాత్రి సందర్భంగా మార్చి 2న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని చిత్ర సమర్పకుడు గంగపట్నం శ్రీధర్ మీడియాకు తెలియజేస్తూ "చార్మికి ఇదొక వైవిధ్యమైన చిత్రం.ఇటీవల విడుదలైన పాటలకి అద్భుత స్పందన వచ్చినందుకు ఆనందంగా ఉంది. గతంలో మా కాంబినేషన్‌లో వచ్చిన 'మంత్ర' మాదిరిగానే ఈ సినిమా కూడా అందర్నీ అలరిస్తుందనే నమ్మకముంది. ప్రేక్షకుల్ని భయపెట్టడానికి చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేశారు. మేం మాత్రం కొత్త పంథాలో వెళ్లాం. చార్మి నటన ఈ సినిమాకి ప్రధాన బలం. ఆహార్యం విషయంలో చార్మి ప్రత్యేక శ్రద్ధ తీసుకొంది. ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్ని ఆలోచనల్లో పడేస్తుంది '' అన్నారు. ప్రదీప్ రావత్, విజయ్‌సాయి, ఉత్తేజ్, పావలా శ్యామల తారాగణమైన ఈ చిత్రానికి సంగీతం: విశ్వ, ఛాయాగ్రహణం: శివేంద్ర, సహ నిర్మాత: నాగేశ్వరరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఓషో తులసీరామ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X