భయమే మంత్రంలా('మంగళ' ప్రివ్యూ)

By Srikanya

చార్మి తాజా చిత్రం మంగళ ఈ మహాశివరాత్రి పూట విడుదల అవుతోంది. చార్మితో మంత్ర వంటి హిటి సినిమాని రూపొందించిన దర్శకుడు తులసీరామ్ డైరక్ట్ చేసిన చిత్రం కావటంతో మంచి క్రేజే ఏర్పడింది. ఈ చిత్రం కథ విషయానికి వస్తే.. అమ్ములు (చార్మి) సామాన్యమైన అమ్మాయి.ఎప్పుడూ హుషారు, చలాకీదనంతో అందరితో కలిసిపోతూ సరదాగా ఉంటుంది.అయితే అనుకోకుండా ఓ రోజు.. తన ప్రమేయం లేకుండా ఓ సమస్యలో ఇరుక్కొంటుంది. అందుకు ప్రధాన కారణం ముత్తయ్య (ప్రదీప్‌ రావత్‌). అసలు ముత్తయ్య ఎవరు? అతనికీ అమ్ములుకీ సంబంధం ఏమిటి? ఆ ఉచ్చులోంచి అమ్ములు ఎలా బయట పడింది అనేదే చిత్ర కథ.

ఈ చిత్రం గురించి తులసీరామ్‌ మాట్లాడుతూ...ఉత్కంఠత కలిగించే కథ, కథనాలు ఈ సినిమాకు ప్రధాన బలం. 'మంత్ర'లానే భయపెట్టిస్తాం. కానీ ఆ సన్నివేశాలన్నీ కొత్త తరహాలో సాగుతాయి. 'ఐస్‌...ఐస్‌' అనే పాట అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. ఆనంద్‌ అందించిన నేపథ్య సంగీతం కథకు ప్రాణం పోసింది అన్నారు. చార్మి మాట్లాడుతూ..నామీద నమ్మకంతో అందరూ సినిమా చూడొచ్చు. దర్శకుడి మీద నమ్మకంతో నేను సినిమా చేశాను అంది. అలాగే ఈ చిత్రం డబ్బింగ్ చెప్పిన ప్రతిరోజూ నిద్రపట్టేది కాదు. ఇంకా అదే హ్యాంగోవర్‌లో ఉన్నాను. స్క్రీన్‌ప్లే భయపెడుతుంది. మంత్ర థ్రిల్లర్ అయితే మంగళ హారర్ సినిమా. చిన్నపాటి డివోషనల్ టచ్ కూడా ఉంటుంది. నా పాత్ర గ్లామర్‌గా ఉంటుంది అంది.

సంస్థ: మంత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్‌
నటీనటులు: చార్మి, ప్రదీప్‌ రావత్‌, విజయ్ ‌సాయి, ఉత్తేజ్‌, సుభాష్‌, సారిక రామచంద్రరావు తదితరులు
నిర్మాత: సిహెచ్‌.వి.శర్మ, తులసీరామ్‌
దర్శకత్వం: ఓషో తులసీరామ్‌

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X