చార్మి 'మంగళ' ఎంతదాకా వచ్చింది?
చార్మి ప్రధాన పాత్రలో ఓషో తులసీరామ్ స్వీయ దర్శకత్వంలో రూపొందింస్తున్న చిత్రం 'మంగళ'. ఈ చిత్రం పతాక సన్నివేశాలు మినహా షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో...దర్శకనిర్మాత తులసీరామ్ మాట్లాడుతూ "చార్మితో నేను రూపొందించిన 'మంత్ర' ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకొంది. 'మంగళ' వైవిధ్యమైన కథ, కథనాలతో సాగుతుంది. థ్రిల్లర్ తరహా చిత్రమే అయినా సన్నివేశాల కూర్పు, పాత్రల చిత్రణ నవ్యరీతిలో ఉంటాయి. తనదైన నటనతో చార్మి మరోసారి మెప్పిస్తుందన్నారు.
మంగళ తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది.అసాధారణ స్క్రిప్టుతో తులసీరామ్ ఈ చిత్రాన్ని తీస్తున్నారు. 'మంత్ర' కంటే రెండు మెట్లు ఎక్కువగా ఈ సినిమా ఉంటుంది. 'మంగళ' పాత్రలో నన్ను నేనే చాలెంజ్ చేసుకుంటున్నా. ఇది బాగా భయపెట్టే సినిమా అంటూ చెప్పుకొచ్చింది చార్మి. ఈ చిత్రంలో ప్రదీప్‌రావత్, సుభాష్, విజయ్‌సాయి, ఉత్తేజ్ తదితరులు నటిస్తున్నారు. మాటలు: జంధ్యం వెంకటేష్‌బాబు, పాటలు: సుద్దాల అశోక్‌తేజ, విశ్వ, సంగీతం: విశ్వ, ఛాయాగ్రహణం: శివేంద్ర, సమర్పణ: జి.శ్రీధర్.


Click it and Unblock the Notifications











