ఇప్పుడు తెలుగులో హాట్ ఫేవరెట్ హారోయిన్ ఛార్మి. 'మంత్ర' హిట్టయిన దగ్గరనుండి ఆమె దశ తిరిగిపోయింది. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా ఆఫర్లు వరసగా వస్తున్నాయి. తాజాగా 'మీ శ్రేయాభిలాషి' సినిమాతో పాపులర్ అయిన ఈశ్వరరెడ్డి లేటెస్ట్ చిత్రం 'మనోరమ' లో నటించనుంది. ఈ చిత్రం యావత్తు ఆమె పాత్ర చుట్టూ తిరుగుతుంది. అలాగే ఈ సినిమా కోసం 40 లక్షలు భారీ వ్యయంతో ఒక స్ట్రీట్ సెట్ వేస్తున్నారు. జూలై లో షూటింగ్ ప్రారంభించి ఆగష్టు, సెప్టెంబరు నెలల్లో జరిగే సింగిల్ షెడ్యూల్ లో నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేయాలని నిర్మాత యం.శ్రీనివాసరావు ప్లాన్ చేస్తున్నారు. దీనికి కథ-మాటలు పద్మశ్రీ అందిస్తుండగా సినిమాటోగ్రఫి అడుసుమిల్లి విజయ్ కుమార్ నిర్వహిస్తారు.