అల్లు శిరీష్‌తో చార్మి హల్‌చల్, నెక్ట్స్ మంత్ర దర్శకుడితో
హైదరాబాద్ : హీరోయిన్ చార్మి దర్శకుడు ఓషో తులసీరామ్‌తో మూడో సినిమా చేయబోతోంది. ఇప్పటికే తులసీరామ్ దర్శకత్వంలో 'మంత్ర', 'మంగళ' చిత్రాల్లో నటించిన చార్మి మరో సినిమాకు రెడీ అవుతోంది. ఈ చిత్రం కూడా లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కబోతోంది.
మంత్ర ఎంటర్టెన్మెంట్ పతాకంపై 'మంగళ' చిత్రాన్ని రూపొందించిన నిర్మాత సి.హె. శర్మ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ....'మంగళ' చిత్రం నిర్మాతగా నాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. మంత్ర, మంగళ దర్శకుడు ఓషో తులసీరామ్ చెప్పిన కథ బాగా నచ్చి ఈ చిత్రాన్ని ప్రారంభిస్తున్నాను. డిఫరెంట్ ప్యాట్రన్‌లో ఉండే ఈ చిత్రం షూటింగ్ జూన్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం స్కిప్టు వర్క్ జరుగుతోంది. ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తాం' అన్నారు.
ఆ సంగతి పక్కన పెడితే....బుధవారం హైదరాబాద్ లో జరిగిన సన్ రైజర్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ సందర్భంగా అల్లు శీరిష్‌తో కలిసి చార్మి స్టేడియంలో హడావుడి చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలను తన ట్విట్టర్లో పోస్టు చేసింది. ఆ పిక్చర్స్ స్లైడ్ షోలో వీక్షించవచ్చు.

అల్లు శిరీష్‌తో కలిసి ఉప్పల్ స్టేడియంలో చార్మి సందడి

అల్లు శిరీష్‌తో కలిసి ఉప్పల్ స్టేడియంలో చార్మి సందడి

గెలుపు మనదే అని విక్టరీ సింబల్ చూపుతున్న చార్మి

చాముండేశ్వరి నాథ్, సన్ రైజర్స్ ప్రతినిధితో కలిసి చార్మి


Click it and Unblock the Notifications











