ఎంత డబ్బిచ్చినా చేయనని తెగేసి చెప్తోంది...చార్మి
చాలామంది ఐటమ్ సాంగ్‌లు చేయమని అడుగుతున్నారు. అయితే ఎంతమంది ఎంత డబ్బిచ్చినా కానీ ఐటమ్‌లు మాత్రం చేయనని అంటోంది చార్మి. మరో ఐదారేళ్ల వరకు హీరోయిన్‌గా నిలబడతానని ఆ తర్వాత ఐటమ్‌ల సంగతి ఆలోచిస్తానని అంటోంది. అదేంటి మీ చేతిలో సినిమాలు ఏమీ లేవు కదా అంటే...నేనసలు ఖాళీగా ఉన్నదెప్పుడు అని ప్రశ్నిస్తోంది చార్మి. ఓ పక్క సినిమాలు మరో పక్క యాడ్స్ చేస్తూ బిజీగానే ఉన్నానని బిల్డప్ ఇస్తోంది. త్వరలో మరో రెండు చిత్రాలు ప్రారంభం కానున్నాయని చెప్పింది.. అప్పటిదాకా ప్రస్తుతం వున్న పరిస్థితి కొనసాగుతుందని చెప్పుకొచ్చింది. ఇక రీసెంట్ గా ఆమె నటించిన మంగళ, దొంగలముఠా చిత్రాలు భాక్సాఫీస్ వద్ద పెయిల్యూర్ అయ్యాయి. ఐటం సాంగ్ చేసిన రగడ చిత్ర్రం కూడా భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాకపోవటం కూడా ఆమె కెరీర్ ని దెబ్బతీసింది.


Click it and Unblock the Notifications











