ఛార్మి మరో ఐటెమ్ సాంగ్
ఎన్టీఆర్, వి.వి.వినాయక్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా 'అదుర్స్'. నయనతార, షీలా కథానాయికలుగా నటిస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు, నటుడు మహేష్ మంజ్రేకర్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇంతకు ముందు హోమం, ఒక్కడున్నాడు లాంటి చిత్రాల్లో విలన్ గా నటించిన మహేష్ మంజ్రేకర్ కు ఎన్టీఆర్ తో ఇది మొదటి సినిమా. ప్రస్తుతం స్విజర్ ల్యాండ్ లో పాటల చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం గురించిన తాజా విషయమేమిటంటే ఛార్మిగ్ గర్ల్ 'ఛార్మి' కూడా ఇందులో నటిస్తోందట.
కానీ ఇది కేవలం ఓ పాట వరకేనని తెలిసింది. ఈ మధ్యన ఛార్మి నటించిన చిత్రాలు వరుసగా పరాజయమౌతుంటే, ఆమె ఐటెం సాంగ్స్ పైన దృష్టి సారిస్తోందని తెలిసింది. ఇంతకు ముందు కూడా ఛార్మి తరుణ్, ఇలియానాల కాంబినేషన్ లో వచ్చిన 'భలే దొంగలు' చిత్రంలో ఓ ఐటెం సాంగ్స్ చేసింది. దీనికి 25 లక్షల రూపాయల భారీ పారితోషికం అందుకుందన్న వార్త అప్పట్లో చర్చనీయాంశమయింది. కానీ ఇప్పుడు అంత రెమ్యునరేషన్ డిమాండ్ చేసేంత సీన్ తనకు లేదని సినీవర్గాల భోగట్టా.


Click it and Unblock the Notifications











