twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చార్మితో సల్మాన్ ‌(సెలబ్రిటీ క్రికెట్ లీగ్-3 సంగతులు)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: 2011లో ప్రారంభమైన సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌(CCL)కు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, సాండల్ వుడ్ ఇలా దేశంలోని అన్ని భాషల సినీ పరిశ్రమలకు చెందిన స్టార్స్ ఒకే వేదిక పైకి రావడమే ఇందుకు కారణం. దీంతో గత సంవత్సరం నిర్వహించిన CCL-2 టోర్నీకి కూడా మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం CCL-3కి సన్నాహాలు చేస్తున్నారు.

    CCL-3కి సంబంధించి కర్టెన్ రైజర్(జట్ల పరిచయ వేదిక) కార్యక్రమం జనవరి 19న ముంబైలోని ఫిల్మ్ సిటీలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ స్టేజ్ ఫెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సల్మాన్ తో పాటు సౌతిండియా హీరోయిన్లు చార్మి, శ్రద్ధా దాస్ కూడా స్టెప్స్ వేయనున్నట్లు తెలుస్తోంది. మరో ఆసక్తికర రూమర్ ఏమిటంటే.... గాంగ్నమ్ స్టైల్ సాంగ్ ఫేమ్ స్పై కూడా ఈ వేడుకలో తన పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నాడట.

    గత సంవత్సరం వరకు తెలుగు, తమిళం, కేరళ, కర్నాటక, హిందీ ఇలా 5 పరిశ్రమలకు చెందిన ఐదు టీంలు మాత్రమే ఉండేవి. అయితే ఈ సంవత్సరం నుంచి మరో రెండు టీంను అదనంగా చేరబోతున్నాయి. ఈ సంవత్సరం మరాఠీ, బోజ్ పురి టీంలు కూడా జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

    తెలుగు వారియర్స్ టీం నుంచి.... కెప్టెన్ విక్టరీ వెంకటేష్ తరుణ్, శ్రీకాంత్, నితిన్, ఆదర్శ్ తదితరులు ఈ కర్టెన్ రైజర్ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 9 నుంచి CCL-3 టోర్నమెంట్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కేరళలోని కోచ్చిలో జరుగనుంది. దేశంలోని వివిధ నగరాల్లో మ్యాచ్ లు జరుగనున్నాయి. త్వరలో అందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కానుంది.

    English summary
    The Celebrity Cricket League (CCL), which was commenced in 2011, has grown to become more popular than the International Cricket Council (ICC) games with its second season. Now, the stage is getting ready for the third season and the organizers of these matches have planned a grand gala ceremony for its curtain raiser event. Salman Khan, Charmi and few other celebs are reportedly performing on the occasion.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X