చార్మి వేశ్యగా ‘ప్రేమ ఒక మైకం’ తాజా న్యూస్
దర్శకుడు మాట్లాడుతూ 'వెండి తెరపై వేశ్య పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంది. సావిత్రి, జయసుధ, శ్రీదేవి, లక్ష్మి, ప్రభ, టబు, కరీనా కపూర్, అనుష్క వంటి ప్రముఖ కథానాయికలంతా వేశ్య పాత్రలో రాణించారు. ఆ స్థాయిలోనే ఇందులో చార్మి పాత్ర ఉంటుంది. ఎంతో శ్రద్ధ తీసుకుని ఈ పాత్రను తీర్చి దిద్దుతున్నాం. ఇదొక మ్యూజికల్ లవ్ స్టోరీ. ఒక వేశ్యకు, రచయితకు, గాయనికి మధ్య జరిగే కథ ఇది'' అని తెలిపారు.
నిర్మాతలు మాట్లాడుతూ..'ఇటీవలే గోవాలో ఓ కీలకమైన షెడ్యూలు చేసాం. చార్మి, తదితరులపై ముఖ్య సన్నివేశాలు చిత్రీకరించాం. ప్రస్తుతం ఆర్ ఎఫ్ సిలో కొన్ని సీన్లు షూట్ చేస్తున్నాం. ఈ నెలాఖరుకు షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. ఇందులో మొత్తం 8 పాటలు ఉన్నాయి' అని తెలిపారు.
సోనీ చరిష్టా, సతీష్, చంద్రమోహన్, రావు రమేష్, తాగుబోతు రమేష్, పృథ్వీ, సురేఖ వాణి, చంటి, జాకీ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి మాటలు: పులగం సి. నారాయణ, కెమెరా: ప్రవీణ్ బంగారి, పాటలు: కుల శేఖర్, శశి, సమర్పణ: బేబీ హ్యాపీ.


Click it and Unblock the Notifications












