ఎమోషనల్ జర్నీ (‘ప్రేమ ఒక మైకం’ ప్రివ్యూ)
హైదరాబాద్ : ఛార్మి ప్రధాన పాత్రలో రూపొందిన 'ప్రేమ ఒక మైకం' చిత్రం ఈ రోజు విడుదల అవుతోంది. టెన్త్ క్లాస్, నోట్ బుక్ చిత్రాల దర్శకుడు చందు దర్శకత్వంలో టూరింగ్ టాకీస్ పతాకంపై డి. వెంకట సురేష్, కె. సూర్య శ్రీకాంత్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ పాత్రికేయులు పులగం చిన్నారాయణ ఈ చిత్రంతో మాటల రచయితగా పరిచయమవుతున్నారు. 'హ్యాపీడేస్' రాహుల్, 'ప్రేమిస్తే' శరణ్య కీలకపాత్రల్లో నటించారు.
వేశ్య, గాయని, రచయిత ..ఈ మూడు పాత్రల మధ్య సాగే కథాంశమిది. ప్రేమ అనే పదానికి తావులేని.. శరీరాన్ని పంచడమే తెలిసిన ఓ వేశ్య జీవితంలో ప్రేమ ఆడిన గమ్మత్తయిన నాటకమే 'ప్రేమ ఒక మైకం' అంటున్నారు చందు. అలాగే 'వెండి తెరపై వేశ్య పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంది. సావిత్రి, జయసుధ, శ్రీదేవి, లక్ష్మి, ప్రభ, టబు, కరీనా కపూర్, అనుష్క వంటి ప్రముఖ కథానాయికలంతా వేశ్య పాత్రలో రాణించారు. ఆ స్థాయిలోనే ఇందులో చార్మి పాత్ర ఉంటుంది. ఎంతో శ్రద్ధ తీసుకుని ఈ పాత్రను తీర్చి దిద్దుతున్నాం. ఇదొక మ్యూజికల్ లవ్ స్టోరీ. ఒక వేశ్యకు, రచయితకు, గాయనికి మధ్య జరిగే కథ ఇది. చక్కని మ్యూజికల్ లవ్‌స్టోరి ఇది. ప్రతి ఫ్రేమూ కనువిందు చేస్తుంది. పాటలు ట్రెండీగా ఉన్నాయని ఫోన్లొస్తున్నాయి'' అని తెలిపారు.
ఛార్మి మాట్లాడుతూ... అందరూ మల్లిక అందాన్ని చూశారు. ఎందుకంటే ఆమె ఓ వేశ్య కాబట్టి. ఆమెను అవమానించినవాళ్లే తప్ప... ఆప్యాయంగా పలకరించినవాళ్లు తక్కువ. అందుకే మల్లికకీ మానవ సంబంధాలపై నమ్మకం పోయింది. లలిత్ ఆమె జీవితంలోకి ప్రవేశించిన తరవాత ఆలోచనలో మార్పు వచ్చింది. ఆ మార్పు ఏ దిశగా అన్నది తెర మీదే చూడాలని చెప్పింది.
నిర్మాత మాట్లాడుతూ ''చీకట్లో పుట్టి చీకట్లో బతుకుతూ చీకట్లో కలిసిపోయే జీవితాలు మీవి అంటూ మల్లిక అవమానానికి గురవుతుంది. ఆ సమయంలోనే లలిత్ పరిచయమవుతాడు. అప్పుడామె తీసుకున్న నిర్ణయం ఏమిటన్నది తెర మీదే చూడాలి. మనసున్న మల్లికగా ఎలా నిలబడిందన్నది ఆసక్తికర అంశం. ఛార్మి నటన యువతకు నచ్చుతుంది. సెన్సార్ ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. సినిమా చూసినవారంత యాప్ట్ టైటిల్ పెట్టామని ప్రశంసించారు. పాటలకు చక్కని స్పందన వస్తోంది. ఛార్మి నటనకు మంచి మార్కులు పడతాయి''అన్నారు.
నటీనటులు: ఛార్మి, రాహుల్, శరణ్యం, సోనీ చరిష్టా, సతీష్, చంద్రమోహన్, రావు రమేష్, తాగుబోతు రమేష్, పృథ్వీ, సురేఖ వాణి, చంటి, జాకీ తదితరులు సమర్పణ: బేబీ హ్యాపీ తదితరులు
పాటలు: కులశేఖర్, శశి,
సంగీతం: ఎస్.ఆర్.పోశం,
మాటలు: పులగం.సి.నారాయణ,
కెమెరా: ప్రవీణ్.కె.బంగారి
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: పి.ప్రతాప్, గీతానంద్‌రెడ్డి,
సహనిర్మాత: జితిన్ చక్రవర్తి
సమర్పణ: బేబీ హ్యాపీ.
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: చందు


Click it and Unblock the Notifications












