చేదు అనుభవాలు ఎదురయ్యాయి : ఛార్మి
అలాగే... ''కొన్ని కథల విషయంలో ధైర్యంగా నేనే ఓ నిర్ణయాన్ని తీసుకొంటా. కొన్నిసార్లు మాత్రం పక్కవాళ్ల సలహాలు అడిగి తెలుసుకొంటుంటా. మంత్రాలు, దెయ్యాలు అంటూ ఏవో సినిమాలు చేసుకొంటున్న సమయంలో చందు నాకు 'ప్రేమ ఒక మైకం' కథ చెప్పారు. ఇందులో వేశ్యగా నటించాలన్నప్పుడు ఆలోచనలో పడిపోయాను. కథ నచ్చింది కానీ... తెరపై ఎలా చూపిస్తారో అనే భయం కలిగింది. అందుకే మొదట ఒప్పుకోలేదు. నా స్నేహితురాలితో చర్చించాక ఇందులో నటించాలని నిర్ణయించుకొన్నా. నిజానికి ఇందులో నేను కాల్ గర్ల్‌గా కనిపిస్తాను. ఓ ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఆ పాత్రకి ఉంటుంది. పులగం చిన్నారాయణ రాసిన సంభాషణలు కదిలించేలా ఉంటాయి'' అంది.
చిత్రంలో తన పాత్ర గురించి చెప్తూ... ప్రాస్టిట్యూట్, కాల్ గాళ్‌కి మధ్య వ్యత్యాసం ఉంది. కాల్‌గాళ్ తనకు నచ్చినవాళ్లతోనే వెళుతుంది. ఇందులో మల్లిక అలాంటి అమ్మాయే. హైక్లాస్ కాల్‌గాళ్. స్టయిలిష్‌గా ఉంటుంది. తనను మించిన అందగత్తె లేదనుకుంటుంది. ఎవరైనా ఫోన్ చేసి రమ్మంటే, 'నీ ఫొటో పంపించు. నచ్చితే వస్తా' అంటుంది. మల్లిక వెరీ బోల్డ్. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడే మహిళలందరికీ నచ్చేలా తీయాలనుకున్నాం. లేడీస్ అందరూ ఇష్టపడి చూసే విధంగా ఉంటుంది. ఎక్కడా అభ్యంతరకరంగా ఉండదు. 'ప్రేమ ఒక మైకం' చూసిన తర్వాత ప్రేక్షకులు 'బాగుంది' అని చిన్న మాట అన్నా చాలు.. 'హిట్' అయిపోతుంది. ఆ మాట అంటారనే నమ్మకం ఉంది.
పెళ్లి గురించి మాట్లాడుతూ... ''అందరూ పెళ్లి గురించే అడుగుతున్నారు. పాతికేళ్లొస్తే పెళ్లి చేసుకోవాల్సిందేనా? నలభయ్యేళ్లకి కూడా చేసుకోవచ్చు. కెరీర్‌ని చక్కబెట్టుకోవడానికి మాత్రం ఇదే సరైన సమయం. అందుకే ప్రస్తుతానికి పెళ్లి ఆలోచనేమీ లేదు. తెలుగులో 'ప్రతిఘటన'లో నటిస్తున్నాను. నిశ్చల అనే పాత్రలో పాత్రికేయురాలిగా కనిపిస్తాను. ఇందులో ఏడు పేజీల డైలాగ్ ఒకటుంది. అది చిత్రానికే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. 'మంత్ర 2'లో కూడా నటించబోతున్నా'' అని వివరించింది.


Click it and Unblock the Notifications












