వెయ్యిమంది నాగ సాధువులుతో ఛార్మి
ఇటీవల ఛార్మీ , వెయ్యిమంది నాగ సాధువులు పై భారీ క్లైమాక్స్‌ను చిత్రించాం అంటున్నారు 'మంగళ' దర్సకుడు ఓషో తులసిరామ్. గంగపట్నం శ్రీధర్ సమర్పణలో 'మంత్ర' ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'మంగళ'. ఛార్మి ప్రధాన పాత్రధారి. ఓషో తులసీరామ్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే వికారాబాద్‌లో పూర్తయింది.ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ చిత్ర దర్శకుడు ఓషో తులసీరామ్ ఇలా చెప్పారు. అలాగే "ప్రేక్షకులకు నచ్చే వెరైటీ సబ్జెక్ట్ ఇది. గతంలో వచ్చిన 'మంత్ర' లాగానే మరో వైవిధ్యమైన అంశంతో ముందుకు సాగుతున్నాం. పాటలు కూడా రసవత్తరంగా ఉంటాయి. ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయి. నవంబర్‌లో ఆడియో విడుదల చేస్తామ''ని అన్నారు. ఈ చిత్రంలో ప్రదీప్‌రావత్, సుభాష్, రామ్‌జగన్, ఉత్తేజ్, పావలా శ్యామల తదితరులు నటించారు. సమర్పణ: గంగపట్నం శ్రీధర్, సహ నిర్మాత: బాణా నాగేశ్వరరెడ్డి, కెమెరా: దాశరథి శివేంద్ర, సంగీతం: విశ్వ.


Click it and Unblock the Notifications











