హిట్ కోసం ఛార్మి ఆరాటం, రాత్రి పూట ఒకే...!
హైదరాబాద్: ఛార్మి ప్రధాన పాత్రలో వచ్చిన ‘మంత్ర' చిత్రం అప్పట్లో పెద్ద హిట్టయింది. దీంతో ఇపుడు ఆ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. ‘మంత్ర-2' టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎస్.వి.సతీష్ దర్శకత్వం వహిస్తున్నారు. గ్రీన్ ఫిలిమ్స్ పతాకంపై కె.ఎ.రవికుమార్‌రెడ్డి సమర్పణలో పి.శౌరీరెడ్డి, వి.యాదగిరిరెడ్డి, బోనాల శ్రీకాంత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
చాలా కాలంగా సరైన హిట్ లేని ఛార్మి....ఈ చిత్రం ద్వారా హిట్ కొట్టాలని ఆరాట పడుతోంది. ఇందుకోసం తన శక్తి మేర కష్టపడుతోంది. కథాంశం ప్రకారం రాత్రి పూట చిత్రీకరించే సన్నిశాలు ఉండటంతో ఏ మాత్రం సంకోచించకుండా ఓకే చెప్పేసింది. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈచిత్రం వివరాలను నిర్మాతలు వెల్లడించారు.

నిర్మాతలు మాట్లాడుతూ...20 రోజులపాటు నిరవధికంగా రాత్రి సమయాల్లో షూటింగ్ చేశామని, హీరోయిన్ ఛార్మి అందిస్తున్న సహకారం మరువలేమని అన్నారు. సంగీత దర్శకుడు చక్రి అందిస్తున్న సంగీతం ఈ చిత్రానికి ప్లస్ అవుతుందని, హర్రర్, సస్పెన్స్, థ్రిల్లర్‌గా రూపొందే ఈ చిత్రాన్ని చేయడం ఆనందంగా వుందని, ఇంతవరకూ ఇలాంటి సబ్జెక్ట్‌తో ఎవరూ టచ్ చేయలేదని తెలిపారు.
సినిమా పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తయిన తర్వాత మిగతా వివరాలు వెల్లడించనున్నాు. తనికెళ్ల భరణి, చేతన్, రాహుల్‌దేవ్, ఉత్తేజ్, ఛత్రపతి శేఖర్, ఢిల్లీ రాజేశ్వరి, వేణు, టివి-5 వేణు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: గాంధీ మనోహర్, కెమెరా: తనికెళ్ల రాజేంద్ర, సంగీతం: చక్రి, ఎడిటింగ్: సిద్ధంశెట్టి బాబు, ప్రొడక్షన్ డిజైనర్: దేశినేని శ్రీనివాస్, దర్శకత్వం: ఎస్.వి.సతీష్.


Click it and Unblock the Notifications











