సెన్సార్ పూర్తి, చిరంజీవిపై సెటైర్లు ఉన్నాయట!
హైదరాబాద్: చరితచిత్ర పతాకంపై చార్మి కీలకపాత్రధారిణిగా తమ్మారెడ్డి భరద్వాజ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'ప్రతిఘటన'. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దేశరాజధాని ఢిల్లీలో జరిగి నిర్భయ ఘనటను ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఈచిత్రం రూపొందుతోంది.
తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ బోర్డ్ వారు ఈ చిత్రానికి U/A ధృవీకరణ పత్రం జారీ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ... సినిమను ఏప్పిల్ 5న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఛార్మీ ఈ సినిమాలో చాలా మంచి పాత్ర పోషించింది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ తప్పకుండా ఖచ్చితంగా నచ్చుతుందనే నమ్మకం నాకుంది అన్నారు.
కాగా...ఈ చిత్రంపై గత కొంతకాలంగా విచిత్రమైన ప్రచారం సాగుతోంది. ఈ చిత్రంలో చిరంజీవిని ఉద్దేశించిన కొన్సి సెటైర్లు ఉన్నాయని ఆ వార్తల సారాంశం. మరి ఈ వార్తల్లో నిజమెంతో సినిమా విడుదలైతేగానీ చెప్పలేం....

ప్రతిఘటన
గతంలో తెలుగులో విజయశాంతి ప్రధాన పాత్రలో ఓ ‘ప్రతిఘటన' సినిమా వచ్చింది. ఇపుడు అదే పేరుతో మరో సినిమా వస్తున్నప్పటకీ.......ఇవి కథాపరంగా పూర్తిగా విభిన్నమైన చిత్రాలు.

చార్మి
ఇప్పటికే మంత్ర, సుందరకాండ, మనోరమ, కావ్యాస్ డైరీ, మంగళ, నగరం నిద్రపోతున్న వేళ లాంటి లేడీ ఓరియేంటెడ్ చిత్రాల్లో చార్మి నటించింది. వాటి మాదిరిగానే ‘ప్రతిఘటన' చిత్రం కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమానే.

మంచి పేరొస్తుందంటున్న చార్మి
ఈ చిత్రం తనకు మంచి పేరు తెస్తుందని చార్మి ఎంతో నమ్మకంగా ఉంది. సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని, నేటి పరిస్థితులకు అద్దం పట్టే విధంగా సినిమా ఉంటుందని తెలిపారు

జర్నలిస్టు పాత్రలో చార్మి
గతంలో నగరం నిద్రపోతున్న వేళ చిత్రంలో జర్నలిస్టుగా నటించిన చార్మి...ప్రతిఘటన చిత్రంలో కూడా జర్నలిస్టుగా కనిపించబోతోంది.

రేష్మ
ఈచిత్రంలో చార్మి మహిళా జర్నలిస్టుగా నటిస్తోంది. అత్యాచార బాధితురాలి పాత్రలో రేష్మ నటిస్తోంది.


Click it and Unblock the Notifications











