ఇలియానా గురించి చార్మి షాకింగ్ కామెంట్!
హైదరాబాద్: హీరోయిన్ల మధ్య పోటీ వాతావరణం అనేది సహజం. ఈ క్రమంలో అప్పుడప్పుడు ఒకరంటే ఒకరికి పడనట్లు వ్యవహరిస్తారు. అయితే ఒకరి గురించి మరొకరు నెగెటివ్ కామెంట్లు చేసుకోవడం మాత్రం చాలా అరుదు. ఎవరైనా అలా మాట్లాడారంటే అదో సెన్సేషన్ న్యూస్ అవుతుంది.
తాజాగా హీరోయిన్ చార్మి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ఇటీవల ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న చార్మి.... ఇలియానా గురించి నెగెటివ్ కామెంట్లు చేసింది. ఇలియానాను మేకప్ లేకుండా అస్సలు చూడలేమంటూ వ్యాఖ్యానించింది. గతంలో ఇలియానా, చార్మి ...ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘రాఖీ' చిత్రంలో నటించిన సంగతి తెలిసింది.

ఇలియానా బక్కపలుచని సౌందర్యం ఇష్టపడని కొందరు చార్మి మాటలు నిజమే అని అంటుంటే.....ఇలియానా ఫ్యాన్స్ మాత్రం చార్మి ఇలా మరొకరి గురించి నెగెటివ్ కామెంట్స్ చేయడం తగదని అంటున్నారు. మరి చార్మి చేసిన కామెంట్ల విషయం ఇలియానా చెవిన పడ్డాయో? లేదో?
చార్మి గురించిన వివరాల్లోకి వెళితే...తెలుగులో పెద్ద సినిమాల్లో ఆమెకు అవకాశాలు రావడం లేదు. చిన్న చితకా సినిమాలు చేస్తూ కెరీర్ అలా సాగించేస్తోంది. ఇక ఇలియానా సౌత్ సినిమాలుకు గుడ్ బై చెప్పి బాలీవుడ్లో నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఆమె తొలి బాలీవుడ్ చిత్రం బర్ఫీ హిట్టవడం ఆమెకు...తర్వాత రెండు మూడు సినిమాల్లో అవకాశాలు తెప్పి పెట్టేలా చేసాయి. అయితే అవన్నీ ప్లాపు కావడంతో ప్రస్తుతం అవకాశాలు లేక ఇబ్బంది పడుతోంది.


Click it and Unblock the Notifications











