అనుకోకుండా ఒకరోజు సినిమాలో చేసిన ఛార్మి,శశాంక్ కాంబినేషన్ మళ్ళీ తెరపైకి రానుంది. హిందీలో ఫ్రీకిచక్ర అనే కామిడీ చిత్రాన్ని డైరక్ట్ చేసిన యాడ్ ఫిల్మ్ మేకర్ వి.కె.ప్రకాష్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నాడు. అక్టోబర్ ఇరవై నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఇందిరా క్రియేషన్ పతాకంపై మహేష్ బాబు సోదరి మంజుల నిర్మిస్తోంది. ఇక పోకిరి కో ప్రొడ్యూసర్ గా చేసిన తర్వాత ఆమె నిర్మిస్తున్న చిత్రం ఇదే కావటం తో అంతటా ఆసక్తి నెలకొంది. ఇక శశాంక్ ఇప్పటికే మూడు వేర్వేరు సినిమాలో బిజీగా ఉన్నాడు. ఛార్మీ సంగతి చెప్పేదేముంది. వారానికో కొత్త ప్రాజెక్టు కోసం ఆమెను ఎవరో ఒకరు సంప్రదిస్తూనే ఉన్నారు. ఇక ఆ హిట్ పెయిర్ మళ్ళీ సృష్టిస్తుందని ఆశిధ్దాం.