For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సక్కు బాయి’కోసం ప్రెంచ్ గెడ్డం సగం తీసేసా:నాగ్

    By Srikanya
    |

    హైదరాబాద్ : నాగార్జున తన తాజా చిత్రం లవ్ స్టోరీ కోసం ప్రెంచ్ గడ్డం పెంచుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడాయన తన గెడ్డం సగం తీసేయాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే చెపుతూ...తాజాగా ఛార్మి కోసం చేసిన సక్కుబాయి ఐటం సాంగ్ కోసం నా గడ్డం సగం తీసేయాల్సి వచ్చింది. నేను మళ్లీ త్వరగా పెంచాలి. ఎందుకంటే దశరధ్ తో చేస్తున్న రొమాంటిక్ కామెడీ లవ్ స్టోరీలో పాత్రకు ఈ గడ్డం ఉండాలి అన్నారు. ఇక ఢమురకం చిత్రంలో సక్కుబాయి పాట వస్తుంది.

    లక్ష్మిరాయ్ ని అనుకున్న తర్వాత అనుకోకుండా సీన్ లోకి వచ్చేసి ఛార్మి ఈ పాట ఛాన్స్ ని కొట్టేసింది. అన్నపూర్ణ వేసిన సెట్ లో ఈ పాటను చాలా లావిష్ గా తీసారు. ఈ విషయమై ఛార్మి చాలా ఆనందంగా ఉంది. ఆమె ఈ పాటకు చెందిన ఫోటోలను ట్విట్టర్ లో ఉంచి తన హ్యాపీనెస్ ని తెలియచేసింది. ప్రస్తుతం ఈ పాట షూటింగ్ జరుగుతుంది. మరో మూడు,నాలుగు రోజుల్లో ఈ పాట పూర్తి కానుంది. ఈ చిత్రం ఓ సోషియో ఫాంటసీ,అనూష్క హీరోయిన్ గా చేస్తోంది.

    ఈ చిత్రం గురించి నాగార్జున మాట్లాడుతూ....'నా కెరీర్లోనే మొదటి సారి ఇలాంటి ఫాంటసీ మూవీ చేస్తున్నాను. హై టెక్నికల్ వేల్యూస్‌తో చేశారు. నా కెరీర్లోనే హై బడ్జెట్ మూవీ ఇది. సినిమా చాలా బాగా వచ్చింది. ఇది నాకు చాలా పెద్ద రేంజ్ సినిమా అవుతుంది' అన్నారు. నిర్మాత వెంకట్ మాట్లాడుతూ...'ఒక పాట మినహా షూటింగ్ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. నాగార్జున కెరీర్లోనే ఇది హై బడ్జెట్ మూవీ అవుతుంది. జులై రెండో వారంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం' అన్నారు.

    దర్శకుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ...'నాగార్జున కెరీర్లోనే ఇదో పెద్ద లాండ్ మార్క్ అవుతుంది. నిర్మాత వెంకట్ ఎక్కడా కంప్రమైజ్ కాకుండా సినిమా తీస్తున్నారు' అని చెప్పారు. కో ప్రొడ్యూసర్ సురేష్ రెడ్డి మాట్లాుడుతూ...'ఒక వైపు పోస్టు ప్రొడక్షన్ వర్క్ లో భాగంగా ఎడిటింగ్, డబ్బింగ్ ఫాస్ట్ గా జరుగుతున్నాయి' అని చెప్పారు. నాగార్జున, అనుష్క, ప్రకాష్ రాజ్, గణేష్, వెంకట్రామన్, బ్రహ్మానందం, రఘుబాబు, యంఎస్ నారాయణ, కృష్ణ భగవాన్, జీవా బ్రహ్మాజీ, అవినాష్, దేవన్, గిరిబాబు, రామరాజు, దువ్వాసి మోహన్, సమీర్, శ్రవణ్, రాజా శ్రీధర్, ప్రభు, కమల్, ప్రగతి రజిత, కవిత, గీతాంజలి, సత్యకృష్ణన్, ప్రియ, అభినయ, కల్పన, అపూర్వ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి ఫోటోగ్రఫీ: చోటాకె నాయుడు, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కథ: వెలిగొండ శ్రీనివాస్, డాన్స్: రాజు సుందరం, సమర్పణ: కె. అచ్చిరెడ్డి, నిర్మాత: వెంకట్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీనివాసరెడ్డి

    English summary
    Nagarjuna even lost his much-appreciated French beard just for item number with Charmi in his upcoming film Damarukam. The actor told.."For this song, I shaved off my beard. I will have to grow it back after the shooting of this song to stay in character for my upcoming romcom." While Anushkha is playing the female lead in this socio-fantasy film directed by Srinivasa Reddy, Prakash Raj plays Lord Shiva.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X