చార్మి 'సై ఆట' కోసం దేవిశ్రీప్రసాద్ ప్రత్యేక శ్రద్ద..
చార్మి ప్రధానపాత్రలో రూపొందిన 'సై ఆట' చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రం ఇదే నెల 13న విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు నల్లూరి సుధారాణి, రాజశేఖర్ మీడియాతో మట్లాడారు. వారి మాటల్లో...'ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం గొప్ప ఎస్సెట్ అని చెప్పాలి. ఆయన స్వరపరిచిన పాటలు ఇప్పటికే మార్కెట్ లోకి విడుదలై శ్రోతలను అలరిస్తున్నాయి. రీరికార్డింగ్ విషయంలో కూడా ఆయన ప్రత్యేకశ్రద్ధ తీసుకున్నారు' అన్నారు. అలాగే...ఈ చిత్రం నృత్య నేపథ్యంలో సాగే కథాంశమిది. తమ సమస్యలను ఈ కాలం అమ్మాయిలు ఎలా పరిష్కరించుకుంటారో చార్మి పాత్ర ద్వారా చెబుతున్నాం. చార్మి అభినయం అందరినీ ఆకట్టుకుంటుంది. ఆమె కెరీర్‌లోని బెస్ట్ ఫిలిమ్స్ జాబితాలో ఈ సినిమా చేరుతుంది అన్నారు. ఇక డా.శివప్రసాద్, ఆలీ, నాజర్, అజయ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు, పాటలు: భాషాశ్రీ, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఫొటోగ్రఫీ: జె.ప్రభాకర్‌రెడ్డి, సమర్పణ: కాణిపాకం క్రియేషన్స్, నిర్మాణ నిర్వహణ: దేశినేని శ్రీనివాస్, నిర్మాతలు: నల్లూరి సుధారాణి, రాజశేఖర్, దర్శకత్వం: కె.ఆర్.కె.పవన్.


Click it and Unblock the Notifications











