రియాలిటీ షోలను నమ్ముకున్న చార్మి

By Srikanya

గతంలో చార్మి చేసిన అనుకోకుండా ఒకరోజు, మంత్ర, మనోరమ చిత్రాలకు ఇది పూర్తి భిన్నమైన చిత్రం. నేటి తరం అమ్మాయిలకు రోల్‌ మోడల్‌గా నిలిచే పాత్రను చార్మి ఈ చిత్రంలో చేశారు. ఆమె కెరీర్‌లో చెప్పుకోదగ్గ విధంగా ఈ పాత్ర వుంటుంది అంటున్నారు దర్శకుడు కేఆర్‌కె పవన్. రియాలిటీ షోల నేపధ్యంలో చార్మి ప్రధానపాత్రలో చేసిన 'సై ఆట' జూన్‌ మొదటివారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అజయ్ హీరోగా రూపొందుతున్న ఈ సై ఆట చిత్రంలో ఆమె పాత్ర పేరు వైజాగ్ కత్తి సమాచారం. కోట శ్రీనివాసరావు కూడా కీలకపాత్రలో కనిపించే ఈ చిత్రం కథ టీవీలో వచ్చే డాన్స్ బేబి డాన్స్ తరహా రియాలిటి షో ల చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్ర దర్శకుడు పవన్ గతంలో సత్తా అనే చిత్రానికి డైరక్ట్ చేసారు. అవార్డు సంపాదించిన ఈ చిత్రం సాయికిరణ్ హీరోగా రూపొందింది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ చిత్రానికి మాటలు, పాటలు: భాషాశ్రీ, కెమెరా: జె.ప్రభాకర్‌ రెడ్డి, నిర్మాణ నిర్వహణ: దేశినేని శ్రీనివాస్‌, సమర్పణ: కాణిపాకం క్రియేషన్స్‌, నిర్మాణం: ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X