సినిమాల్లోకి రాకముందుకి ఇప్పటికీ తేడా...చార్మి
సినీ పరిశ్రమకు రాకముందు నాకు క్రమశిక్షణ అంటే ఏమిటో తెలిసేది కాదు. ఇక్కడకు వచ్చిన తరవాతే నాకు కొన్ని పద్ధతులు తెలిశాయి అంటోంది చార్మి. అదే గతంలో అయితే అర్ధరాత్రి దాటేదాకా కార్టూన్ ఛానెల్ చూడటం..ఏ మధ్యాహ్నమో నిద్ర లేవడం..ఎప్పుడు పడితే అప్పుడు తినడం.. ఇలా చేసేదాన్ని. కానీ ఇప్పుడు పద్ధతి ప్రకారం దినచర్య ఉంటోంది. క్రమశిక్షణ అనేది ప్రతి మనిషికి ఎంత అవసరమో నాకు ఇక్కడకు వచ్చిన తరవాతే బోధపడిందని...సినిమాల్లోకి రాకముందు నా దగ్గర ఏమి లేదో..ఇప్పుడు అది నా దగ్గర ఉంది ఛార్మి వివరించింది. ప్రస్తుతం చార్మి...శ్రీకాంత్ సరసన సేవకుడు అనే చిత్రంలో చేస్తోంది. సముద్ర దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. అలాగే చార్మి తనకు హిట్ ఇచ్చిన మంత్ర దర్శకుడు తులసీ రామ్ డైరక్షన్ లో మంగళ అనే చిత్రం చేస్తోంది. దీనితో పాటు సముద్ర దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా వస్తున్న సేవకుడు లోనూ చేస్తోంది. అలాగే టీవీ రియాలిటీ షో ఆధారంగా చార్మి నటించిన సయ్యాట చిత్రం కూడా త్వరలో రిలీజ్ కాబోతోంది.


Click it and Unblock the Notifications











