ఛార్మీ సినిమాకి అంత సీన్ ఉందా?
ఓ ప్రక్క చార్మి నటించిన సినిమాలు వరసగా భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అవుతున్నాయి. అలాగే ఆమె హీరోయిన్ గా చేసిన సినిమాలు కొన్ని షూటింగ్ పూర్తి చేసుకుని అమ్ముడు పోక ల్యాబ్ లలో మగ్గుతున్నాయి. ఇటువంటి స్ధితులో చార్మి ప్రధాన పాత్రలో రూపొందిన కాదల్ కిస్ ..కిస్ అనే తమిళ చిత్రాన్ని తెలుగులోకి డబ్బింగ్ అవుతోంది. చంద్రముఖి వంటి సూపర్ హిట్ చిత్రాన్ని రూపొందించిన పి.వాసు దీని డైరక్టర్. అమ్మాయిలను కాలేజీకి అభిమానంతో పంపాలే తప్ప అనుమానంతో కాదు అనే అంశంతో ఈ చిత్రం రూపొందింది. దాంతో ఈ చిత్రం ఎంత వరకూ వర్కవుట్ అవుతుందన్నసందేహాలు అందరికి కలగుతున్నాయి. అయితే ఇవన్నీ ఊహించే చిత్రాన్ని డబ్ చేస్తున్నారంటే వారి మార్కెటింగ్ స్టాటజీలు వారికుండే అవకాసం ఉంది. ముఖ్యంగా చాలా తక్కువ రేటుకి వచ్చే ఈ చిత్రం కి మంచి శాటిలైట్ మార్కెట్ ఉండే అవకాసం ఉంది.
ఇక ఈ చిత్రం గురించి తెలుగు వెర్షన్ నిర్మాత మాట్లాడుతూ... " సరికొత్త కథ, కథనాలతో పూర్తి వైవిధ్యంగా రూపొందిన చిత్రమిది. మలేసియా నేపథ్యంలో కొనసాగే ఈ కథలో మంచి సందేశం కూడా ఇమిడి వుంది. నేటి మహిళలు ఎంతో పురోగతి సాధిస్తున్నారు. అన్ని రంగాల్లో తమదైన ప్రతిభతో ముందుకు వెళ్తున్నారు. అయినా నేడు కొంతమంది తల్లితండ్రులు అమ్మాయిలను చదివించటానికి ఇష్టపడటం లేదు. వారిని కాలేజీకి పంపినా ప్రతి క్షణం వారి వెన్నంటే వుంటూ వారికి పూర్తి స్వేచ్ఛ నివ్వకుండా వారి అభివృద్ధిని నిరోదిస్తున్నారు. ఇలాంటి పలు అంశాలను ఈ చిత్రంలో చర్చిస్తున్నాం. అన్ని వాణిణ్య అంశాలతో చిత్రం రూపుదిద్దుకుంది. ప్రతి సన్నివేశం హృదయాన్ని కదిలించే విధంగా వుంటుంది. నేటి సమకాలీన పరిస్థితులను ప్రతిబింబించే ఈ చిత్రం తప్పకుండా తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తుందనే నమ్మకముంది' అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విద్యాసాగర్, నిర్మాణం: బి.బి.యస్ స్టూడియో.


Click it and Unblock the Notifications











