మస్కట్ లో 'రమ్' కొడుతూ ఛార్మి
ఈచిత్రంలో రంభగా త్రిష మెయిన్ రోల్ చేస్తుండగా.....ఇతర హీరోయిన్లు పూర్ణ, అర్చన సైడ్ క్యారెక్టర్స్ ఊర్వశి, మేనక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం గురించి త్రిష మాట్లాడుతూ 'ఈ చిత్రం యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోందని, ఫైట్ మాస్టర్ విజయ్ పర్యవేక్షణలో తాను డేర్ డెవిల్ యాక్షన్ సన్నివేశాలు చేస్తున్నానని' వెల్లడించింది.
ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడలో విడుదల కానుంది. ఈచిత్రంలో రంభగా త్రిష, మేనక పాత్రలో పూర్ణ ఎంపికవగా.....ఊర్వశి పాత్రకు మాత్రం అన్వేషణ సాగుతోంది. తాజాగా ఊర్వశి పాత్రకు హీరోయిన్ ఖరారైంది. పవన్ కళ్యాణ్ 'పులి' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన నికీషా పటేల్ ఊర్వశి పాత్రకు ఎంపికైంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
'నేను తెలుగులో మూడో సినిమాకు సైన్ చేసాను. ఎంఎస్ రాజు స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందుతున్న 'రమ్' చిత్రలో ఊర్వశి పాత్ర చేయబోతున్నాన్నాను' అంటూ ట్వీట్ చేసింది. పులి తర్వాత తెలుగులో నికీషాకి సినిమా అవకాశాలేవీ రాలేదు. ఈ మధ్యనే కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న 3డి మూవీ 'ఓం' చిత్రంలో ఒక హీరోయిన్ పాత్రకు ఎంపికయింది. 'రమ్' ఆమె తెలుగులో చేయబోతున్న మూడో చిత్రం.
ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడలో విడుదల కానుంది. నిర్మాతగా తెరంగ్రేటం చేసిన ఎంఎస్ రాజ ఆ మధ్య వరుస హిట్లు కొట్టి బాగా పాపులరైన సంగతి తెలిసిందే. అయితే అన్ని రోజులు ఒకేలా ఉండవు అన్నట్లు ఈ మధ్య ఈ నిర్మాత వరుస ప్లాపులు చుట్టుముట్టాయి. ఇటీవల తన తనయుడిని హీరోగా పరిచయం చేస్తూ దర్శకత్వంలో వేలు పెట్టి చేయి కాల్చుకున్నారు. మరి ఈ సినిమాలో ఎంఎస్ రాజు పని తీరు ఎలా ఉంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications












