త్రిష, తమన్నా, ఛార్మిల విందు ఉగాదికే

By Staff

Trisha-Tamanna-Charmi
ఈ ఉగాది పండుగ తెలుగువారు త్రిష, తమన్నా, ఛార్మి ల సినిమాల సాక్షిగా జరుపుకోనున్నారు. ఆ రోజు త్రిష ప్రధానపాత్రలో నటించిన ఆకాశమంతా రిలీజ్ అవుతోంది. తమిళంలో తయారైన అభినయనానుమ్ చిత్రాన్ని దిల్ రాజు కొద్ది పాటి తెలుగుదనం అద్ది ప్రమోట్ చేస్తున్నారు. తండ్రి కూతుళ్ళ రిలేషన్ ప్రధానంగా ఈ చిత్రం నడుస్తుంది. ముద్దుల కొడుకు ఫేమ్ రాధామోహన్ ఈ చిత్ర దర్శకుడు. తమిళంలో ఈ చిత్రం పెద్దగా వర్కవుట్ కాలేదు. తెలుగులో జగపతి బాబు వంటి వారు గెస్ట్ లుగా చేస్తున్నారు, దిల్ రాజు నిర్మాత కాబట్టి కొంత ఆశించవచ్చు.

ఇక ఛార్మి హీరోయిన్ గా చేస్తున్న మనోరమ. మీ శ్రేయాభిలాషి చిత్రంతో పేరుతెచ్చుకున్న ఈశ్వరరెడ్డి ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నాడు. మంత్ర ఫీవర్ ఈ మధ్యన తగ్గిందని వరస ఫ్లాపులు ఛార్మికి గుర్తు చేస్తున్నాయి. దాంతో ఈ చిత్రం వర్కవుట్ అయితేనే ఫలితముంటుందని ఛార్మి ఎదురుచూస్తోంది. టెర్రరిస్టుని మార్చే కథతో ఓ థ్రిల్లర్ లా ఈ చిత్రం రాబోతోందని వినికిడి. మస్త్ వంటి చెత్త సినిమాతో తెలుగు లో ప్రవేశించిన జీ మోషన్ పిక్చర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇక హ్యాపీ గర్ల్ తమన్నా ప్రధానపాత్రలో వస్తున్న చిత్రం ఆనందతాండవం. దశావతారం వంటి భారీ చిత్రం నిర్మించిన ఆస్కార్ ఫిలింస్ వారు తమిళంలో నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగులోకి డబ్బింగ్ అవుతోంది. ఎన్నారై కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కిందని సమాచారం. ఈ చిత్రంపై నే బాగానే అంచనాలు ఉన్నాయి. ఇంతకీ ఈ మూడు రిలీజ్ అయ్యేది ఉగాది రోజు. ఆరోజు మార్చి ఇరవై ఏడు. దగ్గరకొచ్చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X