దర్శకుడుని చెంప చెళ్లుమనిపించిన మ్యాటర్ పై చార్మి
అయితే చార్మి మాత్రం దానికి భిన్నంగా ట్వీట్ చేసింది. ఆమె ట్వీట్ లో... ఏం జరిగిందని అడిగేవాళ్ళకు నా సమాధానం ఒకటే... ప్రేవేట్ మ్యాటర్స్ పై పబ్లిక్ గా కామెంట్స్ చేయటం ఇష్టం ఉండదు అని...అయితే ఆమె ఇలా ట్వీట్ చేయడంతో చెంప చెళ్లుమనిపించిన విషయం నిజమేనని, ఆమె రూమర్ అని ఖండించకపోవటం, ప్రెవేట్ మ్యాటర్ అని తేల్చటం తో ఆ విషయం నిజంగానే చోటు చేసుకుందని అందరూ నిర్ధారణకు వస్తున్నారు.
ఇక చార్మి ప్రస్తుతం వేశ్య పాత్రలో నటిస్తోంది. చిత్రం టైటిల్ 'ప్రేమ ఒక మైకం'. 'టెన్త్‌క్లాస్', 'నోట్ బుక్' చిత్రాలను తెరకెక్కించిన చందు దర్శకత్వం వహిస్తున్నారు. టూరింగ్ టాకీస్ పతాకంపై తెరకెక్కిస్తున్నారు. డి. వెంకట సురేష్, కె. సూర్య శ్రీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'హ్యాపీడేస్' ఫేమ్ రాహుల్, 'ప్రేమిస్తే' శరణ్య ఇందులో కీలక పాత్రధారులు. ఇప్పటికి 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. దర్శకుడు మాట్లాడుతూ "వెండితెరపై వేశ్య పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంది. సావిత్రి, జయప్రద, శ్రీదేవి, లక్ష్మి, ప్రభ, టబు, కరీనాకపూర్, అనుష్క వంటి ప్రముఖ కథానాయికలంతా వేశ్య పాత్రల్లో రాణించారు. ఆ స్థాయిలోనే ఇందులో చార్మి పాత్ర ఉంటుంది. ఎంతో శ్రద్ధ తీసుకుని ఈ పాత్రను తీర్చిదిద్దుతున్నాం.
ఇదొక మ్యూజికల్ లవ్‌స్టోరీ. ఒక వేశ్యకు, రచయితకు, గాయనికి మధ్య జరిగే కథ ఇది'' అని చెప్పారు. నిర్మాతలు మాట్లాడుతూ "ఇటీవలే గోవాలో ఓ కీలకమైన షెడ్యూల్ చేశాం. చార్మి, తదితరులపై ముఖ్య సన్నివేశాలు చిత్రీకరించాం. ప్రస్తుతం ఆర్ఎఫ్‌సీలో కొన్ని సీన్లు షూట్ చేస్తున్నాం. ఈ నెలాఖరుకు షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. ఇందులో మొత్తం ఎనిమిది పాటలున్నాయి'' అని తెలిపారు. సోని చరిష్టా, సతీష్, చంద్రమోహన్, రావు రమేష్, తాగుబోతు రమేష్, పృథ్వీ, సురేఖావాణి, చంటి, జాకీ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి మాటలు: పులగం సి. నారాయణ, కెమెరా: ప్రవీణ్ బంగారి, పాటలు: కులశేఖర్, శశి, సమర్పణ: బేబీ హ్యాపీ.


Click it and Unblock the Notifications












