చాకులా తయారైన చార్మి... అభిమానులకు అందాలతో పోట్లు! (ఫోటోలు)
హైదరాబాద్: హీరోయిన్ చార్మి ఈ మధ్య చాలా బొద్దుగా తయారైన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన 'ప్రేమ మైకం' చిత్రంలో చార్మి రూపం విమర్శలకు దారి తీసింది. దీంతో బరువు తగ్గాలని నిర్నయించుకున్న చార్మి చాలా కష్టపడి ఏకంగా 9 కిలోలు తగ్గింది. చాకులా తయారైంది. తన లుక్ ఇపుడు ఎలా ఉంది? అంటూ వరుసగా హాట్ ఫోటోలను ఆన్‌లైన్లో అప్‌లోడ్ చేస్తూ....తన అందాలతో అభిమానుల గుండెలు జారి పోయేలా చేస్తోంది.
కొన్ని వారాలుగా చార్మి జిమ్‌లో చాలా కష్టపడి వర్కౌట్లు చేస్తోంది. బరువు తగ్గాలనే కసి ఆమెలో పెరగడానికి కారణం... బరువెక్కిన చార్మి గ్లామర్ ఇక సినిమాలకు పనికి రాదని కొందరు విమర్శించడమే. వారి అభిప్రాయం తప్పు అని నిరూపించేందుకే చార్మి చాలా కష్టపడి మరీ ఇలా సెక్సీ లుక్‌లోకి మారిపోయింది.
తన హాట్‌లుక్ ఎలా ఉందో అందరికీ తెలిసేలా...తన సోషల్ నెట్వర్కింగు సైట్లో వరుస పెట్టి ఫోటోలు పోస్టు చేస్తోంది. ఇప్పుడు ఆ ఫోటోలు ఇంటర్నెట్లో ఒక వైరల్‌లా విస్తరించాయి. ముఖ్యంగా ఆమె నాభి అంధాలు అదుర్స్ అంటూ పొగిడేస్తున్నారు అభిమానులు. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో చూద్దాం...

చార్మి కౌర్
తన ఫోటో షూట్ గురించి చార్మి స్వయంగా తన ట్విట్టర్లో వెల్లడించింది. "Heeey guys .. I did a new photoshoot .. Vry excited to show u d NEW ME" అంటూ వ్యాఖ్యానించింది.

9 కిలోలు తగ్గిన చార్మి
చార్మి చెప్పిన వివరాల ప్రకారం....ఆమె ఏకంగా 9 కిలోలు తగ్గింది. ఆ తర్వాతే ఇలా ఫోటో షూట్లకు సెక్సీగా ఫోజులు ఇచ్చిది.

ప్రశంసలు
చార్మి ఈ హాట్ ఫోటోలు పోస్టు చేసిన వెంటనే...ఆమె అందాలు ఎంతో హాట్‌గా ఉన్నాయంటూ ప్రశంసల వర్షం కురిపించడం మొదలు పెట్టారు అభిమానులు.

థాంక్స్ చెప్పిన చార్మి
తన హాట్ ఫోటోలకు ఊహించని రెస్పాన్స్ రావడంతో చార్మి ఉబ్బి తబ్బిబ్బవుతోంది. ఇందుకు గాను ఆమె అందరికీ థాంక్స్ చెప్పింది. "Thanks for d unbelievable response for all d pics from my latest photo shoot ..Vil b releasing 2 pics everyday vitout d watermark only fr U" అంటూ ట్వీట్ చేసింది.

చార్మికి కవరేజ్
ఇలా తన అందాలతో ఇంటర్నెట్‌ను చార్మికి మీడియా తరుపు నుంచి కూడా మంచి కవరేజ్ లభించింది. దీంతో ఆమెకు పబ్లిసిటీ ఒక్కసారిగా పెరిగి పోయింది.

చార్మి కెరీర్
తన కెరీర్లో చార్మి ఇప్పటి వరకు దాదాపు 50 చిత్రాల్లో నటించింది. ఇండియాలోని దాదాపు అన్ని సినిమా పరిశ్రమల్లోనూ పని చేసింది.

తెరంగ్రేటం
తెలుగు సినిమా ‘నీతోడు కావాలి' చిత్రంతో చార్మి తన కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత తమిళంతో పాటు ఇతర భాషా చిత్రాల్లోనూ నటించింది.

రాబోయే సినిమాలు
ప్రస్తుతం చార్మి తెలుగులో ‘రంభ ఊర్వశి మేనక' చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు బాలీవుడ్ మూవీ R...Rajkumar చిత్రంలో అతిథి పాత్రలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











